తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. షర్మిల పార్టీపై స్పందన అనవసరమని, అసందర్భమని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ గెలవాలనే చూస్తుందని జానారెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు .

Also Read:తెలంగాణలో స్పీడ్ పెంచిన షర్మిల...!

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశించింది కాబట్టే తాను పోటీకి సిద్ధమవుతున్నట్లు జానా తెలిపారు. తెలంగాణలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది తానేనని.. ప్రభుత్వాన్ని నిలదీసేందుకే పోటీ చేస్తున్నాని జానారెడ్డి వెల్లడించారు.

తనకు పదవులపై ఆశ లేదని.. ఎమ్మెల్యే పదవి నాకు చిన్నదేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేయడానికి తాను పోటీ చేస్తున్నట్లు జానారెడ్డి తెలిపారు. తనతో వున్న వాళ్లు చాలా మంది పోతున్నారని.. కానీ ప్రజలు తనతో వస్తున్నారని, అది చాలన్నారు.