రైతుల కోసం బ్రేస్ లెట్ వేలం వేయనున్న జగ్గారెడ్డి

jaggareddy to auction the bracelet presented by VH
Highlights

గత వారంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కానకగా ఇచ్చిన బంగారు కంకణం( బ్రాస్‌లెట్‌)ను సంగారెడ్డి కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి వేలం వేస్తున్నారు. శనివారం(10 వ తేది) గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో ఈ వేలం నిర్వహిస్తారు. వచ్చిన డబ్బును ఖమ్మం  రైతులకు అందిస్తారు.

గత వారంలో  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు( వీహెచ్‌ ) తనకు కానకగా ఇచ్చిన  బంగారు కంకణం( బ్రాస్‌లెట్‌)  ను వేలం వేస్తున్నట్లు సంగారెడ్డి కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి వెల్లడించారు.

 శనివారం(10 వ తేది) గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో ఈ వేలం కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన విలేకరులతో చెప్పారు.

బ్రాస్‌లెట్‌ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఖమ్మంలో బేడీలు వేసిన రైతులకు ఆర్థిక సాయంగా అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. 

ఈ బ్రేస్ లెట్ చిత్రమయిన పరిస్థితిలో జంగారెడ్డికి కానుకగా లభించింది.

జూన్ 1 తేదీన సంగారెడ్డిలో  కాంగ్రెస్ సమావేశం తర్వాత రాహుల్ గాంధీకి విహెచ్ జగ్గారెడ్డి గురించి చాలా గొప్పగా చెప్పారు.

 సంగారెడ్డి సమావేశం వెనక ఉన్న మనిషి జగ్గారెడ్డి అని, సభ ఖర్చంతా ఆయన భరించాడని కూడా చెప్పారు.

అపుడు రాహుల్ గాంధీ నువ్వు ఏమయిన ఇవ్వచ్చుగదా అనివిహెచ్ తో అన్నారు.

విహెచ్ తేరుకునే లోపే ఈ  కంకణం ఆయనకు ఇవ్వవచ్చ అన్నారు.

అన్నదే తడవుగా విహెచ్ తన చేతికి ఉన్న కంకణం తీసి జగ్గారెడ్డికి కానుకగ ఇచ్చారు.

ఇదే ఇపుడు ఖమ్మం రైతుల  సహాయం కోసం వేలానికి వెళ్తున్నది.

loader