అమ‌రుల స్పూర్తి యాత్ర జాక్ ఛెయిర్మన్ కోదండ‌రాం చేపడుతున్నారు.  తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ల సాధ‌న కోసం ఈ  స్పూర్తి యాత్ర‌ను చేపడుతున్నారు.  జెఎసి. ద‌శ‌ల‌వారీగా చేప‌ట్ట‌నున్న ఈ యాత్ర‌ మొద‌టి ద‌శ‌ ఈనెల 21న ప్రారంభమై 24వ తేదీన ముగుస్తుంది.  

అమ‌రుల స్పూర్తి యాత్ర చేప‌ట్ట‌నున్న కోదండ‌రాం


తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ల సాధ‌న కోసం అమ‌రుల స్పూర్తి యాత్ర‌ను చేపట్ట‌నుంది తెలంగాణ జెఎసి. ద‌శ‌ల‌వారీగా చేప‌ట్ట‌నున్న ఈ యాత్ర‌ను మొద‌టి ద‌శ‌ ఈనెల 21న ప్రారంభమై 24వ తేదీన ముగుస్తుంది. 

నాలుగు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న ఈ యాత్ర మొద‌టి రోజు సంగారెడ్డిలో ప్రారంభమై స‌దాశివ‌పేట‌, కోహిర్‌, జ‌హీరాబాద్‌, గంగ్ వీర్ చౌర‌స్తాల‌లో సాగనుంది. 
రెండో రోజైన జూన్ 22న నారాయ‌ణ‌ఖేడ్ నుంచి షురూ అయి ఆందోల్‌, జోగిపేట్‌, న‌ర్సాపూర్‌, కౌడిప‌ల్లిలో సాగ‌నుంది.

జూన్ 23న మెద‌క్‌, శంక‌రంపేట‌, చేగుంట‌, నార్సింగ్‌, రామాయంపేట‌, న‌ర్సంపేట తండాల‌లో సాగ‌నుంది స్పూర్తి యాత్ర‌.
 తొలి ద‌శ‌లో చివ‌రి రోజైన జూన్ 24న నిజాంపేట్‌, పోత‌రెడ్డిప‌ల్లి, భూంప‌ల్లి క్రాస్ రోడ్‌, హ‌బ్బీపూర్ క్రాస్ రోడ్‌, దుబ్బాక, దూంపాల‌ప‌ల్లి, తిమ్మాపూర్‌, సిద్ధిపేట లో సాగ‌నుంది. 

యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు పెంచాల‌ని, రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ విధానం రావాల‌ని ఈ యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు జెఎసి చైర్మ‌న్ కోదండ‌రాం. అమ‌ర వీరుల ఆశ‌యాల‌ను వృథా కానీయ‌బోమ‌ని ఈ సంద‌ర్భంగా యాత్ర‌లో నిన‌దించ‌నున్నారు జెఎసి నేత‌లు.