తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన వెంకీ

ఈటీవీ పాపులర్ ప్రోగ్రాం జబర్దస్త్ లోని నటుడు వెంకీ తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

బుధవారం వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెంకీ కారులో వెళ్తున్నారు. ఆలేరు సమీపంలోకి రాగానే వెనకనుంచి వస్తున్న ఇన్నోవా వాహనం ఆయన కారును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అయితే ఆయన కారును ఢీకొట్టిన ఇన్నోవాలో ఉన్న ఇద్దరు గాయాలపాలయ్యారు.

ప్రమాదంలో వెంకీ కారుతో పాటు ఇన్నోవా కూడా దెబ్బతింది. ఈ ఘటనపై వెంకీ ఆలేరు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశాడు.