హైద్రాబాద్ కెఎన్ఆర్  కన్‌స్ట్రక్షన్ కంపెనీలో బుధవారం నాడు ఐటీ శాఖ అధికారుల సోదాలు నిర్వహించారు.ఢిల్లీ, హైద్రాబాద్ లలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని KNR కన్‌స్ట్రక్షన్ కంపెనీలో బుధవారం నాడు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. Hyderabad తో పాటు ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో కూడా ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు. Telangana రాష్ట్రంలోని Warangal, ములుగు, జనగాంతో పాటు హైద్రాబాద్‌లోని ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ కార్యాలయాల నుండి విలువైన డాక్యుమెంట్లు, నగదును సీజ్ చేశారని సమాచారం. ఈ విషయమై ఇంకా సమాచారం అందాల్సి ఉంది.