హైదరాబాదులో మరోసారి ఐటి దాడులు.. వసుధ ఫార్మాలో కొనసాగుతున్న తనిఖీలు..
హైదరాబాద్ లోని వసుధ ఫార్మా, కెమికల్స్ సంస్థ మీద మంగళవారం ఉదయమే ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి ఆదాయం పన్ను శాఖ (ఐటి) దాడులు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా, కెమికల్స్ సంస్థపై ఐటి దాడులు జరుగుతన్నాయి. ఏకకాలంలో 40 చోట్ల ఐటి సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వసుదా ఫార్మా కంపెనీ చేర్మన్ రాజు నివాసంలోనే కాకుండా కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి.
వసుధ ఫార్మా పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. 15 కంపెనీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు సమాచారం ఉండడంతో ఐటి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఐటి సోదాలు ప్రారంభమయ్యాయి.
50 బృందాలుగా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ డెరూక్టర్ల నివాసాల్లో సోదాలు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
సూర్యాపేటలో ఓ సిమెంటు పరిశ్రమలో అగ్ని ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి, ఒకరికి తీవ్రగాయాలు..