సూర్యాపేటలో ఓ సిమెంటు పరిశ్రమలో అగ్ని ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి, ఒకరికి తీవ్రగాయాలు..
సిమెంట్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం ఇద్దరు కార్మికులను బలి తీసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగింది.

సూర్యాపేట : సూర్యాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సిమెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి తోటి కార్మికులు తెలిపిన వివరాలు.. మునగాటి సైదులు (46), పట్టేటి సాయికుమార్(23) మండలకేంద్రంలో ఉంటారు. వీరు స్థానికంగా ఉన్న గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. . ప్రమాదం జరిగిన సమయంలో పనుల్లో భాగంగా పరిశ్రమలోని కిలిన్ యంత్రం దగ్గర విధుల్లో ఉన్నారు.
అక్కడ వారు పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా వెనుక నుంచి మంటలు వ్యాపించాయి. దీంతోపాటు అత్యధిక ఉష్ణోగ్రతతో ఉండే రాతిపొడి వారిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన తోటి కార్మికులు హుజూర్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో మునగపాటి సైదులు మృతి చెందాడు. ఆ తర్వాత మరో కార్మికుడైన సాయికుమార్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించే ప్రయత్నంలో ఉండగానే అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు.
నిజామాబాద్ కలెక్టరేట్ లో కలకలం.. పెట్రోల్ పోసుకుని సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నం..ట్విస్ట్ ఏంటంటే..
తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు జి సైదులును కోదాడకు తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి చికిత్స జరుగుతుంది. అంతకుముందు నవంబర్లో ఇదే పరిశ్రమలో జరిగిన ఓ ప్రమాదంలో ఓ కార్మికుడు చనిపోయాడు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ప్రజాసంఘాలు, నాయకులు, కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ధర్నా చేశారు.