తిరుగులేని కేసీఆర్ నాయత్వం కింద చాలా కాలంగా, టిఆర్ఎస్ లోని సీనియర్ నాయకులలో అంతర్గత కుమ్ములాటలు స్తబ్దుగా ఉన్నాయి.  ఇప్పుడు అవి  నెమ్మ నెమ్మదిగా, ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 

గతంలో, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు అధినాయకత్వానికి ఆందోళన కలిగించినప్పటికీ, వాటిని విజయవంతంగా సద్దుమణిగేలా చేసారు. ఇప్పుడు ఆ సమస్య కొత్త పుంతలు తొక్కుతుంది. నాయకులు తమ తేడాలను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు.

Also read: కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం షాక్: సుప్రీంలో అఫిడవిట్

ఇటీవల, మొదటిసారి ఎమ్మెల్యే అయిన అబ్రహం మీడియా ముందుకు రావడం పార్టీ నాయకులను, క్యాడర్‌ను షాక్‌కు గురిచేసింది.  గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తన ఆలంపూర్ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు.  

తాను ఎస్సీ వర్గానికి చెందినవాడిని కాబట్టే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కృష్ణ మోహన్ రెడ్డి తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.  తన రెడ్డి కులం కార్డును ఉపయోగించి, తన నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని అబ్రహం ఆరోపించారు.

మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన టిక్కెట్ల పంపకాలన్నీ తన చేతిలోనే ఉన్నాయని కృష్ణ మోహన్ రెడ్డి కార్యకర్తలతో అంటున్నారని ఆరోపణలు చేసారు. తాను నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై తన సిఫారసు మాత్రమే చెల్లుతుందని, ఇది అతని పరిధిలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు.తాను అలంపూర్ ఇంచార్జి గా ఉన్నప్పుడు, కృష్ణ మోహన్ రెడ్డి సిఫారసును పార్టీ నాయకత్వం ఎందుకు పరిగణిస్తుందని ఆయన అన్నారు.

Also read: సూసైడ్ నోట్ లు కాదు...టీఆర్ఎస్ మరణశాసనం రాయాలి: ఆర్టీసి కార్మికులతో బిజెపి ఎంపీ

తాను గతంలో కృష్ణ మోహన్ రెడ్డి జోక్యం గురించి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామా రావుకు, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కు కూడా ఫిర్యాదు చేసానని, కానీ తన ప్రత్యర్థి వైఖరిలో ఎటువంటి మార్పు కూడా కనపడడం లేదని అన్నారు. కృష్ణ మోహన్ రెడ్డి ప్రవర్తన, చర్యలు అలంపూర్, పార్టీ కార్యకర్తలలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. కృష్ణమోహన్ రెడ్డి జోక్యం వల్ల  తాను ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 

అక్రమ ఇసుక తవ్వకాల్లో కృష్ణమోహన్ రెడ్డి హస్తం ఉందా అని విలేఖరులు ప్రశ్నించగా, అది గద్వాల్ జిల్లా మొత్తానికి తెలిసిన బహిరంగ రహస్యమని అన్నారు. 

అంతర్గత కుమ్ములాటలు కేవలం గద్వాల్ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదని, ఇతర జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కూడా అంతర్గతంగా మినీ యుద్ధమే జరుగుతోంది.
సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రుల వైఖరి జూనియర్ ఎమ్మెల్యేలకు తీవ్రమైన కడుపు మంటను కలిగిస్తుంది. మంత్రులు తమ నియోజకవర్గాలను సందర్శించడం, ఆ సమయంలో జూనియర్ ఎమ్మెల్యేలను విస్మరించడం లేదా అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం పట్ల వారు రగిలిపోతున్నారు. 

Also read: మంత్రుల్లో టెన్షన్: ఇద్దరికి కేసీఆర్ ఉద్వాసన, పల్లాకు బెర్త్?

ఇతర నాయకులతో సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల మంత్రి మల్లా రెడ్డి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,  ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అయితే తమ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నారు లేదా హైదరాబాద్‌లో ఉంటున్నారు తప్ప వేరే నియోజకవర్గాల్లో పర్యటించట్లేదు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి ల మధ్య సంబంధాలు సరిగా లేనట్టు సమాచారం. 

లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకు ఓటమికి స్థానిక ఎమ్మెల్యేలను బాధ్యులుగా చేసినందుకు, మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్ తో పార్టీ ఎమ్మెల్యేల సంబంధాలు దెబ్బతిన్నాయి.  మంత్రి  ఇంద్రకరన్ రెడ్డికి కూడా ఎమ్మెల్యేలతో స్నేహపూర్వకమైన సంబంధాలు లేవని, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే  ఉన్నాయని తెరాస అంతర్గత వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.