Asianet News TeluguAsianet News Telugu

మంత్రుల్లో టెన్షన్: ఇద్దరికి కేసీఆర్ ఉద్వాసన, పల్లాకు బెర్త్?

రానున్న కొద్దీ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేయబోతున్నారనే వార్త తెరాస నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు కేబినెట్ నుండి తప్పియబడుతున్నారు, ఎవరు కొత్తగా చేరబోతున్నారు దానిపై చర్చ ఊపందుకుంది. 

telangana cabinet reshuffle: tension prevails in ministers...palla to get berth?
Author
Hyderabad, First Published Nov 13, 2019, 12:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో క్యాబినెట్ లో మార్పులు చేయబోతున్నారు అనే ఒక వార్త షికార్లు చేస్తుంది. దీనితో తెలంగాణ మంత్రుల్లో ఒకింత టెన్షన్ మొదలయ్యింది.  రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అంటూ వస్తున్న వార్తల తో మంత్రులు ఒకింత ఆందోళనలో ఉన్నారు. ఈసారి ఖచ్చితం గా ఇద్దరి పై వేటు పడే అవకాశం ఉంది అని ఊహాగానాలు వినిపిస్తుండడంతో,  ఎవరి పదవి ఉంటుందో ..ఎవరి పదవి ఊడుతుందో అనే ఆసక్తికర చర్చ మొదలయ్యింది. 

కేబినెట్ నుండి బయటకు సాగనంపానున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? అసలు గులాబీదళ అధిపతి మదిలో ఎం ఆలోచిస్తున్నాడు? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. తెరాస నేతల్లో హాట్ టాపిక్. బయట చక్కర్లు కొడుతున్న ఈ వార్త వల్ల ప్రస్తుత మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Also read: చంద్రబాబు బాటలో కేసీఆర్: టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు

ఇక పోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్ లో నలుగురు మంత్రులు ఉన్నారు . జిల్లాలో ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకే గంగుల కమలాకర్ ను మంత్రివర్గం లోకి తీసుకున్నారనే ప్రచారం నడిచింది. గులాబీ ఓనర్స్ అంటూ అప్పట్లో ఈటెల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. డెంగీ మరణాలు కూడా అప్పట్లో గణనీయంగా నమోదవుతుండడంతో ఈటెలకు ఉధ్వాసన తప్పదు అని అనుకున్నారంతా. 

అంతే కాకుండా ఈటెల రాజేందర్ అసమ్మతి గళం అందుకోగానే రసమయి లాంటివారు కోరస్ అందుకున్నారు. కేసీఆర్ ముందు కూడా మాట్లాడడానికి భయపడేవారు,ఇలా కేసీఆర్ పైన్నే అసమ్మతి గొంతుకను ఎత్తుకుంటుండడంతో కేసీఆర్ స్వభావ రీత్యా వారిని ఉపేక్షించబోడని అంతా భావించారు. కాకపోతే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎవ్వరిని కూడా కెసిఆర్ టచ్ చెయ్యకుండా వదిలేసాడు అనేది అంతర్గత వర్గాల మాట.

ఈ సారి మాత్రం కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు మంత్రుల్లో ఒకరి పదవికి  మాత్రం ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని మినహాయిస్తే ఉన్న 16 మందిలో నాలుగోవంతు కరీంనగర్ జిల్లానుండే ఉన్నారన్న కారణం చెబుతూ, ఇతర జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే నెపంతో ఒకరిని తప్పించనున్నట్టు తెలుస్తుంది. 

Also read: ఆ తీర్పుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు... విజయశాంతి కామెంట్స్

అలాగే  గ్రేటర్ పరిధిలో గనుక తీసుకుంటే ఇప్పటికే మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా గ్రేటర్ కు చెందిన నేతే అవడం వల్ల వారి సంఖ్య కూడా నాలుగురుగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అదే కారణం చెప్పి ఒకరిని తప్పించే ఆస్కారం ఉంది. 

తెలంగాణలోని ముస్లిం జనాభా దృష్ట్యా, కేసీఆర్ తోని ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, మహమూద్ అలికి ఎటువంటి ఢోకా లేదు. ఇక సామాజికవర్గ ప్రాతిపదికన తలసాని ముఖ్యమైన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత, గ్రేటర్ లో బలమైన నేత అవ్వడం వల్ల అతన్ని తప్పించే ఆస్కారం కూడా చాల తక్కువ. సబితా ఇంద్రారెడ్డిని మహిళా కోటాలో మొన్ననే కేబినెట్ లోకి తీసుకున్నారు. కాబట్టి ఆమెకు వచ్చిన ప్రాబ్లం కూడా ఏమి లేదు. 

ఇక మిగిలింది మల్ల రెడ్డి. వాస్తవానికి  సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్లొకి తీసుకున్నప్పుడే  మల్లారెడ్డి ఔట్ అని అంతా అనుకున్నారు.  కాకపోతే అప్పుడు ఆయన్ను కూడా ముఖ్యమంత్రి  టచ్ చెయ్యలేదు. కానీ తాజాగా ఆ మంత్రి పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి అనేది పార్టీ అంతర్గత మాట. దీంతో మంత్రివర్గం నుండి ఉద్వాసనకి గురయ్యే  జాబితాలో ఆయన పేరు కూడా ఉండచ్చు అనే ప్రచారం పార్టీలో ఊపందుకుంది.

ఇద్దరికీ ఉద్వాసన పలికితే వారి స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనే చర్చ కూడా ఊపందుకుంది. ఒకరిపేరు మాత్రం బలంగా వినిపిస్తుంది. హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఇంచార్జి గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సక్సెస్ అవ్వడం తో మంత్రి పదవి దక్కే వారిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పెరు ఉండబోతుందని సమాచారం. గత ఎన్నికల్లో ఆ బాధ్యతను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించినప్పటికీ ఆయన విఫలమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం కాళ్లకు చక్రాలు కట్టుకొని హుజూర్ నగర్ మొత్తం కలియతిరుగుతూ, భారీ మెజారిటీతో సైది రెడ్డిని గెలిపించి తన మీద కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. 

Also read: మల్కాజిగిరిలో నేను గెలుస్తా అనుకోలేదు: రేవంత్ రెడ్డి

ఇక్కడ పల్లా  రాజేశ్వర్ రెడ్డికి కలిసివచ్చే మరో అంశం ఏమిటంటే అతనికి కూడా విద్యాసంస్థలు  ఉండడం వల్ల  మల్లారెడ్డి కోటా కూడా భర్తీ చేసినట్టు అవుతుంది. అంగ బలం, అర్థ బలం కూడా తోడవడం ఇక్కడ రాజేశ్వర్ రెడ్డికి కలిసివచ్చే మరో అంశం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్లా రెడ్డిని తప్పిస్తే మళ్ళీ అదే సామాజికవర్గానికి చెందిన పల్లా తో భర్తీ చేసినట్టు కూడా అవుతుంది.

ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో అల్లుడిని మల్కాజ్ గిరి నుండి గెలిపించులోకపోయాడు. గెలిపించుకోలేకపోవడం వల్ల వచ్చిన నష్టం కన్నా, కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి అక్కడనుండి గెలవడం వల్ల జరిగిన డామేజ్ ఎక్కువ. దీనిపై కేసీఆర్ ఒకింత కోపంగా ఉన్నట్టు సమాచారం. మరో కేబినెట్ బెర్తును ఉమ్మడి నిజామాబాదు జిల్లా నుంచి భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. 

మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి ఇలాంటి మార్పులు చేయబోరని అంతా అంటుంటే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక విజయం కేసీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను అమాంతం పెంచేశాయని మరికొందరు అంటున్నారు.  మొత్తం గా మరికొద్ది రోజుల్లో నే సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లో మార్పులు చేయ బోతున్నారనే వార్తల తో మంత్రి వర్గం మొత్తం ఎవరి పదివి ఉంటుందో ..ఎవరి పదవి ఊడుతుందో అని చర్చించుకుంటున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios