టీఎస్ స్థానంలో టీజీ: వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా?


 వాహనాల రిజిస్ట్రేషన్  విషయంలో  తెలంగాణ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.

 Is it necessary to change vehicle registration from TS to TG? lns


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  వాహనాల నెంబర్ ప్లేట్లు  మరోసారి మారనున్నాయి.  2014లో తెలంగాణలో  భారత రాష్ట్ర సమితి  ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో  వాహనాల తెలంగాణను టీఎస్ గా  రాయాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం స్థానంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నెల  4వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో టీఎస్ స్థానంలో  టీజీగా మార్చాలని  కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2014లో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రాష్ట్రాన్ని సూచించే  అక్షరాలుగా టీజీకి కేంద్ర ప్రభుత్వం  అనుమతి ఇచ్చిందని  కానీ,  అప్పటి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం  టీజీ బదులుగా  టీఎస్ గా మార్చిందని తెలంగాణ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.

also read:దెందులూరులో సిద్దం సభ: బస్సు నడుపుకుంటూ వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని (వీడియో)

ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో  టీఎస్ స్థానంలో టీజీగా మారనుంది.అయితే  కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్  చేసుకొన్న వారికే  టీఎస్ స్థానంలో టీజీగా మారుతుందా  అనే విషయమై ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  అయితే గతంలో  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ను  టీఎస్‌గా మార్చుకోవాలని  కోరారు. అయితే  ఆ తర్వాత  ఈ విషయమై  కొందరు కోర్టుల వరకు వెళ్లారు. ఆ తర్వాత  కొత్త వాహనాలకు మాత్రమే టీఎస్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో  ఉన్న వాహనాలకు  కూడ ఇబ్బంది తొలగిపోయింది. అయితే  తెలంగాణలోని వాహనాలను  టీఎస్ గా మార్పిడి చేసుకోవాలని  రవాణా శాఖాధికారులు వాహనదారులకు సూచించారు. కానీ, ఈ విషయమై వాహనదారులు  శ్రద్ద చూపలేదు.

also read:లాల్ కృష్ణ అద్వానీ: ఉక్కు మనిషి అని ఎందుకు పిలుస్తారు?

కొత్తగా  వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకొనేవారి వాహనాలే టీజీగా మారే అవకాశం ఉందని అనధికారిక సమాచారం.  అయితే ఈ విషయమై  ప్రభుత్వం  త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.  ఈ విషయమై  చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా  మంత్రి శ్రీధర్ బాబు  నిన్న  మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

**
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios