Asianet News TeluguAsianet News Telugu

దెందులూరులో సిద్దం సభ: బస్సు నడుపుకుంటూ వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని (వీడియో)

వచ్చే ఎన్నికలకు  వైఎస్ఆర్‌సీపీ తమ పార్టీ క్యాడర్ ను సన్నద్దం చేయడానికి సిద్దం పేరుతో సభలను నిర్వహిస్తుంది. 

Former Minister Perni Nani goes self driving Bus to denduluru Siddam Sabha lns
Author
First Published Feb 3, 2024, 5:04 PM IST

హైదరాబాద్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో  సిద్దం సభను  వైఎస్ఆర్‌సీపీ శనివారంనాడు నిర్వహించింది.ఈ సభకు  మాజీ మంత్రి పేర్నినాని  స్వయంగా బస్సు నడుపుకుంటూ వెళ్లారు. ఇప్పటికే విశాఖపట్టణం జిల్లాలోని భీమిలిలో తొలి సిద్దం సభ జరిగింది.  ఇవాళ  దెందులూరులో రెండో సిద్దం సభను నిర్వహించారు.  

also read:లాల్ కృష్ణ అద్వానీ: ఉక్కు మనిషి అని ఎందుకు పిలుస్తారు?

వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వైఎస్ఆర్‌సీపీ  శ్రేణులను సిద్దం చేసేందుకే  సిద్దం పేరుతో  సభలను ఆ పార్టీ నిర్వహిస్తుంది. ఇవాళ   దెందులూరులో సిద్దం సభను నిర్వహించారు.ఈ సభకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణం నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పేర్ని నాని  పార్టీ కార్యకర్తలతో  కలిసి  బయలుదేరారు.

also read;ప్రత్యేక హోదా అంటే ఏమిటి: లాభాలెన్ని

పేర్ని నాని స్వయంగా బస్సు నడుపుకుంటూ  ఈ సభకు వెళ్లారు.ఈ సభకు వెళ్తున్న వాహనాల్లోని  పార్టీ శ్రేణులను  మాజీ మంత్రి ఉత్సాహపరిచారు.  మాజీ మంత్రి పేర్ని నాని  స్వయంగా బస్సు నడుపుకుంటూ వెళ్తున్న దృశ్యాలను  కొందరు నేతలు వీడియో తీశారు. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు  సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులు చేస్తుంది.తెలుగు దేశం, జనసేనలు  కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు పార్టీలు త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios