లాల్ కృష్ణ అద్వానీ: ఉక్కు మనిషి అని ఎందుకు పిలుస్తారు?

అద్వానీని  ఆయన అభిమానులు  ఉక్కు మనిషిగా పిలుస్తారు. ఈ పేరు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

Why Lal Krishna Advani Called  Iron Man lns ?

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి  లాల్ కృష్ణ అద్వానీని ఉక్కు మనిషిగా పిలుస్తారు.  రెండు స్థానాల నుండి కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో అద్వానీ కీలకంగా వ్యవహరించారు.  అయితే  దీని వెనుక అద్వానీ కీలక నిర్ణయాలున్నాయని  ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు  అద్వానీ తీసుకున్న నిర్ణయాలే  ఆయనను  ఉక్కు మనిషిగా  పిలిచేలా చేశాయి.

also read:జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

లాల్ కృష్ణ అద్వానీ  విద్యార్ధి దశలో రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేశారు.  ఆ తర్వాత ఆయన జనసంఘ్ లో చేరారు.  జనసంఘ్ ఆ తర్వాత జనతా పార్టీలో విలీనమైంది. జనతా పార్టీ నుండి  వేరుపడి 1980  ఏప్రిల్  6న  భారతీయ జనతా పార్టీ  స్థాపించారు. బీజేపీ ఏర్పాటులో అటల్ బిహారీ వాజ్ పేయ్, లాల్ కృష్ణ అద్వానీలు కీలకంగా వ్యవహరించారు.

also read:రెండు స్థానాల నుండి అధికారం వరకు: బీజేపీ విస్తరణలో అద్వానీదే కీలకపాత్ర

జనతా పార్టీ నుండి  వేరుపడి బీజేపీ ఏర్పాటు చేయాలనే  ఆలోచన చేసిన సమయంలో ఈ వాదనను లాల్ కృష్ణ  అద్వానీ బలంగా  విన్పించారు.భారతీయ జనతా పార్టీ  తొలి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.అయితే  జనతా పార్టీ నుండి  విడిపోయి బీజేపీగా ఏర్పాటుపై అప్పట్లో  ఓ కమిటీని ఏర్పాటు  చేసి దేశ వ్యాప్తంగా  సుమారు  10 వేల మంది కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఆ సమయంలో కూడ అద్వానీ  బీజేపీ ఏర్పాటు నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించారని  ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటారు.

also read:లాల్‌కృష్ణ అద్వానీ: 1989లోనే లోక్‌సభలోకి, రాజ్యసభలోనూ సేవలు

బీజేపీని విస్తరించేందుకు  పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన అద్వానీ  ఆ తర్వాత రథయాత్రను అస్త్రంగా ఎంచుకున్నారు. రథయాత్రతో  దేశ వ్యాప్తంగా అద్వానీ పేరు అప్పట్లో మార్మోమోగింది.  రెండు స్థానాల నుండి  బీజేపీ  86 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడానికి  అద్వానీ సాధించిన రథయాత్ర కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.1996, 1998, 1999లలో  బీజేపీ వరుసగా  కేంద్రంలో  అధికారంలోకి వచ్చింది.   2004లో  బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.  2014లో  బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios