ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్ల విక్రయం: ముగ్గురి అరెస్ట్

ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. రూ. 850 టికెట్ ను రూ. 11 వేలకు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. 

India vs Australia cricket match:  Three held for selling cricket tickets in black in Hyderabad

హైదరాబాద్:ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ లో లికెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని హైద్రాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ అస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో  టీ 20 క్రికెట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయంలో గందరగోళం చోటు చేసుకుంది.  రెండు రోజుల క్రితం జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. 

రూ. 850 టికెట్ ను రూ. 11 వేలకు విక్రయిస్తున్న సమయంలో ఎస్ ఓ టీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.  దయాకర్, వెంకటేష్, అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులను ఎస్ ఓ టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి  ఆరు టికెట్లు, సెల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు.ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయం పై గందరగోళం చోటు చేసుకుంది. 

ఈ నెల 15, 22 తేదీలలో ఆన్ లైన్ లో టికెట్లను విక్రయించారు. ఆఫ్ లైన్ లో ఈ నెల 22న టికెట్లను విక్రయించారు. అయితే జింఖానా గ్రౌండ్స్ లో ఆఫ్ లైన్ లో టికెట్లు విక్రయించారు. అయితే ఆఫ్ లైన్ లో టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.  ఈ నెల 15వ తేదీన టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ప్రయత్నిస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్ల  విక్రయం గురించి రెండు రోజుల క్రిత  హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడారు.   3 వేలు ఆప్ లైన్ లో, 11, 450 ఆన్ లైన్ లో విక్రయించినట్టుగా చెప్పారు. ఆరు వేల కార్పోరేట్ టికెట్లు విక్రయించినట్టుగా తెలిపారు హెచ్ సీఏ టికెట్లను బ్లాక్ చేయలేదని చెప్పారు.  బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే  పోలీసులు పట్టుకొంటారన్నారు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే తాము కూడా పోలీసులకు సహకరించి వారిని పట్టిస్తామన్నారు. 

also read:జింఖానా గ్రౌండ్ తొక్కిసలాట బాధితులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

టికెట్ల కోసం జింకానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటపై బేగంపేట పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల క్రితం కేసు నమోదైంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తో పాటు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  టికెట్ల విక్రయానికి సంబంధించి పేటీఎంకు కాంట్రాక్టు ఇచ్చినట్టుగా హెచ్ సీఏ ప్రకటించింది. ఈ కారణంగా టికెట్ల విక్రయానికి సంబంధించి తమకు సంబంధం లేదని హెచ్ సీ ఏ ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios