Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు: ఫార్మా కంపెనీల్లో ఏకకాలంలో తనిఖీలు

హైద్రాబాద్ లో  ఐటీ శాఖాధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ  ఉదయం నుండి  నగరంలోని పలు చోట్ల ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు.

Income tax Raids pharma companies in Hyderabad lns
Author
First Published Jan 9, 2024, 9:19 AM IST


హైదరాబాద్: హైద్రాబాద్ లో మంగళవారం నాడు ఆదాయ పన్ను శాఖాధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో  సోదాలు చేస్తున్నారు.ఏక కాలంలో పలు చోట్ల సోదాలు  కొనసాగుతున్నాయి. హైద్రాబాద్ లోని రాయదుర్గం, కోకాపేటల్లో   మొయినాబాద్ సహా తొమ్మిది ప్రాంతాల్లో  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

also read:తెలంగాణలో జిల్లాలు తగ్గుతాయా, పెరుగుతాయా?: అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్

హైదరాబాద్ లో గతంలో కూడ  పలుమార్లు ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.2023 నవంబర్  25న  హైద్రాబాద్ పాతబస్తీలో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.  పలువురు వ్యాపారుల నివాసాల్లో  ఈ సోదాలు జరిగాయి.  గత ఏడాది నవంబర్  21న  కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ అధికారులు  సోదాలు నిర్వహించారు.  గత ఏడాది నవంబర్  10న కాంగ్రెస్ నేత  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.  హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సోదాలు చేశారు.  పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

also read:విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఇళ్లలో  సోదాలు నిర్వహించడంపై అప్పట్లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చేందుకే  ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని  ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. 

also read:కాంగ్రెస్‌కు కలిసొస్తున్న ఈసీ నిర్ణయం: రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం పార్టీకేనా?

2023 నవంబర్  2వ తేదీన హైద్రాబాద్ లో  కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంధువు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంధువు  గిరిధర్ రెడ్డి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.2023  జూన్  14న  బీఆర్ఎస్ నేత పైళ్ల శేఖర్ రెడ్డి  నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో  కూడ ఐటీ అధికారులు సోదాలు చేశారు.  2023 అక్టోబర్  5న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరుడి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 2023 మే 2న  హైద్రాబాద్ లోని పలు బట్టల దుకాణాల్లో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.గత ఏడాది జూన్  16న బీఆర్ఎస్ నేత మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో సోదాలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios