తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐటీ సోదాలు: రియల్ ఏస్టేట్ సంస్థలపై దాడులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలువురి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుండి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలువురి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని హైద్రాబాద్ నగరంలో రియల్ ఏస్టేట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైద్రాబాద్ లోని ఆదిత్య రియల్ ఏస్టేట్ సంస్థ ప్రతినిధుల ఇళ్లతో పాటు సీఎస్ కే డెవలపర్స్ సంస్థ కు చెందిన ప్రముఖల కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య సంస్థకు చెందిన కోటారెడ్డి ఇళ్లతో పాటు ఆ సంస్థకు చెందిన కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ ,రంగారెడ్డి, వైజాగ్, బెంగుళూరులతో కూడా సోదాలు సాగుతున్నాయి. మరో వైపు హైద్రాబాద్ కు చెందిన రియల్టర్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.ఊర్జితా కన్ స్ట్రక్షన్ సంస్థ ఎండీ కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో రియల్ ఏస్టేట్ సంస్థల్లో నిర్వహించిన సోదాల సమయంలో లభించిన ఆధారాలతో ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ఆ కథనం తెలిపింది.