Asianet News TeluguAsianet News Telugu

Hyderabad rains: ప్రజలెవరూ బయటికి రావొద్దు ... మరికొన్నిగంటల పాటు వర్షం, ఇవీ తాజా అప్‌డేట్స్

హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి (hyderabad Rain) కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

imd forecast heavy rain likely on saturday too here is hyderabad
Author
Hyderabad, First Published Oct 9, 2021, 5:03 PM IST

హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి (hyderabad Rain) కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పురా,రామ్‌నగర్‌, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్‌, సైదాబాద్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌‌, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌ మెట్‌, అనాజ్‌పూర్‌, చైతన్యపురిలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది.

ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, డ్రైనేజీలు, నాళాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం (traffic jam) అయ్యింది. వర్షం అలాగే కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ (ghmc) అధికారులు విజ్ఞప్తి  చేశారు. ముసారాంబాగ్ వంతెనపైకి (moosarambagh bridge) వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. 

ALso Read:హైదరాబాద్‌లో భారీ వర్షం: బయటకు రావొద్దు.. ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పౌరులు త‌మ ప్ర‌యాణ ఏర్పాట్లు చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు అల‌ర్ట్ అయ్యాయి. అత్యవసర సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో 040-21111111కు సంప్రదించాలని అధికారులు సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios