Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో భారీ వర్షం: బయటకు రావొద్దు.. ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

హైదరాబాద్‌లో (hyderabad Rain) కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

ghmc official warns hyderabadis wont come out due to heavy rain
Author
Hyderabad, First Published Oct 8, 2021, 9:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్‌లో (hyderabad Rain) కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పురా,రామ్‌నగర్‌, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్‌, సైదాబాద్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌‌, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌ మెట్‌, అనాజ్‌పూర్‌లో లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది.

ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, డ్రైనేజీలు, నాళాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం (traffic jam) అయ్యింది. వర్షం అలాగే కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ (ghmc) అధికారులు విజ్ఞప్తి  చేశారు. ముసారాంబాగ్ వంతెనపైకి (moosarambagh bridge) వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. 

Also Read:Telangana Rains: ఈ మూడురోజులూ తెలంగాణలో మోస్తరు వర్షాలు... వాతావరణ శాఖ ప్రకటన

కాగా, తెలంగాణలో (telangana) వచ్చే 72 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (hyderabad weather station) హెచ్చరించింది. శుక్రవారం కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం (bay of bengal) వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం బలహీనపడినట్టు ఐఎండీ పేర్కొంది. ఈనెల 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios