తాను తెలుగుదేశం పార్టీ వీడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి ఉప్పలపాటి అనూష రామ్.

రేవంత్ తోపాటు తెలంగాణ టిడిపిలోని ఐటి విభాగమంతా ఖాళీ అవుతుందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారామె.

ఈ విషయమై ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తనకు ఐటి విభాగంలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని తెలిపారు.

తనకు ఆ పదవి రావడంతో రేవంత్ రెడ్డి కృషి కూడా ఉందన్నారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారినా.. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

తమ కుటుంబమంతా తెలుగుదేశం పార్టీతోనే ఉందన్నారు.

ప్రస్తుతం తనకు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు ఉప్పలపాటి అనూష రామ్.

ఆమె విడుదల చేసిన ప్రకటన కింద చూడొచ్చు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/AmUiXz