హైదరాబాద్: అమ్మ  నా దగ్గరికి వచ్చి ఉంటే నాకు అభ్యంతం లేదు. ప్రణయ్ ఫ్యామిలీని వదిలి మాత్రం తాను అమ్మ వద్దకు వెళ్లబోనని  అమృత స్పష్టం చేశారు. అమ్మకు శ్రవణ్ నుండి  భయం ఉండే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.  

తనకు ఫ్యామిలీ ఉందని చెప్పారు. భర్తను పోగొట్టుకొన్న భార్య పరిస్థితి ఎలా ఉంటుందనేది తనకు తెలుసునని చెప్పారు. చనిపోయిన వారి గురించి చెడ్డగా మాట్లాడడం తన ఉద్దేశ్యం కాదన్నారు. ఇప్పుడు కూడ ప్రణయ్ గురించి  చెడ్డగా మాట్లాడితే తాను తట్టుకోలేనని చెప్పారు. 

also read:మారుతీరావు, శ్రవణ్ మధ్య ఆస్తుల గొడవలు: అమృత సంచలనం

తాను ఇక్కడికి వచ్చి ఉంటానంటే ఆమె బాధ్యతను తీనుకొంటానని ఆమె హామీ ఇచ్చారు.  మారుతీరావు తనతో సయోధ్య కోసం ఒక్కసారి ప్రయత్నించినట్టుగా ఆమె  గుర్తు చేసుకొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

ప్రణయ్ చంపిన కేసులో మారుతీరావుకు శిక్ష పడాలని తమ కుటుంబం కోరుకొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.తనకు భర్త లేడు, తండ్రి లేడు ఈ బాధ  ఏమిటో తనకు ఒక్కదానికే తెలుస్తోందని ఆమె చెప్పారు.

 ప్రణయ్ చనిపోయిన సమయంలోనే తాను ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు ధైర్యంగా ఉండనని ఆమె ప్రశ్నించారు. చట్టపరంగా మారుతీరావు కు శిక్షపడాలనుకొన్నాం, కానీ ఆత్మహత్య చేసుకోలేదన్నారు.

బాబు పుట్టాక ఒక్కసారి నన్ను చూసేందుకు అమ్మ వచ్చింది. బాబును చూపాలని కోరితే తాను బాబును చూపించలేదని ఆమె చెప్పారు. అమ్మకు అండగా ఉంటాను.కానీ, ఆమె  తన ఇంటికి వస్తే తన బాధ్యతను తీసుకొంటానని ఆమె హామీ ఇచ్చారు.