మిర్యాలగూడ:  మారుతీరావు,  శ్రవణ్ మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయని మారుతీరావు కూతురు అమృత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నాడు  మిర్యాలగూడలో  అమృత మీడియాతో మాట్లాడారు.   ఆస్తుల కోసం వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని విన్నానని ఆమె చెప్పారు. 

also read:మిర్యాలగూడ స్మశానవాటికలో ఉద్రిక్తత, నాన్నను చూడలేదు: అమృత

మారుతీరావు, శ్రవణ్ కు మధ్య గొడవలు అయినట్టుగా తనకు తెలిసిందన్నారు.  మారుతీరావును బాబాయి శ్రవణ్ కొట్టినట్టుగా చెప్పారు.మారుతీరావు ఆత్మహత్యకు శ్రవణ్ కుమార్  ఒత్తిడి కారణమై ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.  ఒక వ్యక్తిని చంపేంత ధైర్యం ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదన్నారు. 

గతంలో  మారుతీరావు, శ్రవణ్ మధ్య ఆస్తులు ఉమ్మడిగా ఉన్నాయన్నారు.  కానీ, ఇటీవల కాలంలో  వీరిద్దరి మధ్య ఆస్తుల పంపకం జరిగిందని తెలిసిందన్నారు. మారుతీరావుకు కరీంలాంటి బినామీలు అనేక మంది ఉన్నారని  ఆమె అభిప్రాయపడ్డారు.   వీలునామా శ్రవణ్‌ కుమార్ పేరు ఉంటే  ఉంటే అనుమానం వస్తోందనే వీలునామాలో పేరు తీయించారేమోనని  ఆమె అభిప్రాయపడ్డారు.

శ్రవణ్ కుమార్ మారుతీరావుపై రెండు మూడు దఫాలు దాడి చేస్తే ఆయన వేరే ఇంట్లో దాక్కొన్నాడని మిర్యాలగూడలో  కూడ చాలా మందికి ఈ విషయాలు తెలుసునని ఆమె చెప్పారు.

మారుతీరావు తన ఆస్తిలో సగం వాటాను ప్రణయ్ హత్యకు ముందు సగం రాయించాడు. ఈ ఘటన 2018 మార్చికి ముందు చోటు చేసుకొంది. అయితే  ప్రణయ్ కుటుంబసభ్యుల నుండి తనకు ప్రాణహని ఉన్న విషయం తెలుసుకొని ఈ ఆస్తిని రాయించినట్టుగా తెలిసిందన్నారు. 

అయితే ఈ విషయమై తాను తమ పెద్ద మనుషులతో అన్నను ఒప్పించి వీలునామాలో తన పేరును తొలగించినట్టుగా చెప్పారు.కొత్త వీలునామా ప్రకారంగా మారుతీరావు భార్య గిరిజతో పాటు ట్రస్టు పేరున ఆస్తులను రాసినట్టుగా తెలుస్తోంది.