ఇది కాంగ్రెస్ అడ్డా, హుజూరాబాద్, దుబ్బాక ఫలితాలు రిపీట్ కావు: పాల్వాయి స్రవంతి

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తమ ప్రచారాన్నిపూర్తి చేస్తామని  మునుగోడు  కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి చెప్పారు. ఈ నెల 7వ తేదీ తర్వాత మంచి రోజు చూసుకొని నామినేషన్ దాఖలు చేస్తానని పాల్వాయి స్రవంతి  తెలిపారు. 
 

I will File nomination After october 7th :Congress Candidate Palvai sravanthi

హైదరాబాద్: ఈ నెల 7వ తేదీ తర్వాత మంచి రోజు చూసుకొని నామినేషన్ దాఖలు చేస్తానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి చెప్పారు. 

సోమవారం నాడు ఆమె ఓతెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇవాళ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం  తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసే విషయమై పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించనున్నట్టుగా ఆమె తెలిపారు. 

 ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని తాముప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.  తమ ప్లాన్ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేస్తామని పాల్వాయి స్రవంతి చెప్పారు.  మునుగోడు అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ కు కంచుకోట అని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.ఈ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కమ్యూనిష్టు  పార్టీలకుచెందిన క్షేత్రస్థాయి కార్యకర్తలు టీఆర్ఎస్ కు ఓటేసే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని  ఆమె వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కమ్యూనిష్టులు పోరాటం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు.ఈ ఉప ఎన్నికల్లో లెప్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు భిన్నంగా మునుగోడు అసెంబ్లీ స్థానం పలితాలుంటాయని స్రవంతి అభిప్రాయపడ్డారు.

2014లో మునుగోడులో కాంగ్రెస్  అభ్యర్ధి బరిలో లేని కారణంగానే టీఆర్ఎస్ విజయం సాధించినట్టుగా స్రవంతి చెప్పారు. సర్పంచ్ , ఎంపీటీసీలను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు  చేర్పించుకుంటున్నాయన్నారు. కానీ సర్పంచ్ లు, ఎంపీటీసీలుగా గెలిపించిన ఓటర్లను మాత్రం  తమతోనే ఉన్నారని స్రవంతి ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలు న మ్ముతున్నారన్నారు. ఎవరెన్ని డబ్బులిచ్చినా కూడా ప్రజలు డబ్బులకు లొంగరని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్లో లెప్ట్ భావజాలం ఉందని ఆమె చెప్పారు. తన తండ్రితో పాటు నియోజకవర్గంలో 1994 నుండి  విస్తృతంగా పర్యటిస్తున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు.  మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తాను కొత్త కాదన్నారు. ఏ గ్రామంలో ఎవరున్నారనే విషయం తనకు తెలుసునన్నారు.

also read:మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగాయి.అయితే ఆరు దఫాలు కాంగ్రెస్, ఐదు దఫాలు సీపీఐ ,ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఈ స్థానం నుండి విజయం సాధించారు. ఈ ఏడాది ఆగస్టు 8న  ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఆగష్టు 21న బీజేపీలో చేరారు. ఈ స్థానం నుండి ఈ దఫా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ పోటీ చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios