Asianet News TeluguAsianet News Telugu

నా పరిధి ఏమిటో నాకు తెలుసు,పెండింగ్ బిల్లులపై త్వరలో నిర్ణయం: తమిళిసై

తన పరిధికి లోబడే తాను  పనిచేస్తున్నానని  తెలంగాణ గవర్నర్  తమిళిసై  సౌందర రాజన్ చెప్పారు. పెండింగ్  బిల్లులపై  త్వరలో నిర్ణయం తీసుకొంటానని గవర్నర్  తెలిపారు.
 

I Will  decide on Pending bills soon Telangana Governor Tamilisai Soundararajan
Author
First Published Oct 24, 2022, 3:29 PM IST


హైదరాబాద్: తాను తన పరిధికి  లోబడే  నడుచుకుంటానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. గవర్నర్ గా  తనకు  విస్తృత  అధికారాలున్నాయని ఆమె గుర్తు చేశారు. అయినా కూడా తన పరిధికి  లోబడే తాను  నడుచుకొంటున్నట్టుగా తెలిపారు. పెండింగ్ బిల్లులపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటానని  ఆమె  స్పష్టం చేశారు. పెండింగ్  బిల్లులకు  ఆమోదం తెలిపే  అంశం  తన  పరిధిలోనిదేనన్నారు. తాను  ఎవరికీ  వ్యతిరేకం  కాదని  గవర్నర్  స్పష్టం  చేశారని  ప్రముఖ  తెలుగు  న్యూస్ చానెల్  ఏబీఎన్  కథనం ప్రసారం  చేసింది.

తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలు ఈ  ఏడాది  సెప్టెంబర్ మాసంలో  జరిగాయి. ఈ అసెంబ్లీ  సమావేశాల్లో  పలు  బిల్లులకు  అసెంబ్లీ  ఆమోదం తెలిపింది. అసెంబ్లీ  ఆమోదం తెలిపిన  బిల్లులకు గవర్నర్  ఆమోదం తెలపాలి. అయితే  ఈ బిల్లులను  గవర్నర్ ఇంకా ఆమోదించలేదు .  ఆరు చట్టసవరణ  బిల్లులతో  పాటు  మరో  రెండు కొత్త బిల్లులకు అసెంబ్లీ  ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం  తెలపాల్సి  ఉంది. 

 వర్శిటీల్లో రిక్రూట్ మెంట్ కు కామన్ బోర్డు,మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఆజామాబాద్ పారిశ్రామికాభివృద్ది చట్టం,పారెస్ట్  వర్శిటీ  వంటి బిల్లులు  గవర్నర్ ఆమోదం  కోసం ఉన్నాయి. త్వరలోనే ఈ బిల్లుల  విషయవై  నిర్ణయం తీసుకొంటామని   గవర్నర్  తమిళిసై  చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,గవర్నర్ కు మధ్య కొంత కాలంగా  గ్యాప్  కొనసాగుతుంది.   ఇటీవల చెన్నైలో  ఓ  పుస్తకం ఆవిష్కరణ సమయంలో   తెలంగాణ ప్రభుత్వంపై  గవర్నర్ విమర్శలు చేశారు.   

also read తొమ్మిది మాసాల తర్వాత రాజ్ భవన్ కు: తేనీటి విందులో తమిళిసై, కేసీఆర్ నవ్వుతూ మాటలు:

తెలంగాణ  రాష్ట్ర హైకోర్టు  చీఫ్  జస్టిస్ ఉజ్జల్  భయ్యాన్  ప్రమాణ స్వీకారోత్సవ  కార్యక్రమానికి  రాజ్  భవన్ కు  కేసీఆర్ వెళ్లారు. దీంతో  ప్రభుత్వానికి  గవర్నర్ కు   మధ్య ఉన్న అంతరం తగ్గిందని  భావించినవారికి నిరాశే  మిగిలింది. ఆ తర్వాత  స్వాతంత్ర్య  దినోత్సవం  సందర్భంగా  గవర్నర్ తేనీటి విందుకు  కేసీఆర్ ను  ఆహ్వానించారు. ఈ  కార్యక్రమానికి  వస్తానని గవర్నర్  కార్యాలయానికి  సీఎంఓ  నుండి  సమాచారం  అందింది. అయితే చివరి  నిమిషంలో  కేసీఆర్  ఈ  కార్యక్రమాన్ని రద్దు  చేసుకున్నారు.  తేనీటి విందుకు  కేసీఆర్  ఎందుకు  హాజరు కాలేదో తనకు  తెలియదని  గవర్నర్  వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios