తొమ్మిది మాసాల తర్వాత రాజ్ భవన్ కు: తేనీటి విందులో తమిళిసై, కేసీఆర్ నవ్వుతూ మాటలు
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణం సందర్భంగా తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ లు నవ్వుతూ కన్పించారు. చీఫ్ జస్టిస్ ప్రమాణం పూర్తైన తర్వాత తేనేటి విందులో కేసీఆర్, గవర్నర్ లు నవ్వుతూ కన్పించారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య అంతరం ఉన్న విషయం తెలిసిందే. అయితే వీటిని పటాపంచలు చేస్తూ తేనీటి విందులో వీరిద్దరూ కన్పించారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా Ujjal bhuyan ప్రమాణం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ Tamilisai Soundararajanనవ్వుతూ మాట్లాడుకున్నారు. దాదాపు 9 మాసాల తర్వాత తెలంగాణ సీఎం KCR రాజ్ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం ముగిసిన తర్వాత తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్ , కేసీఆర్ లు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్ లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో Telangana Governor కూడా ఫోటోలో కన్పించారు. ఈ సమయంలో కేసీఆర్, Kishan Reddy గవర్నర్ లు నవ్వుతూ కన్పించారు. Rajbhavan కు వచ్చిన కేసీఆర్, గవర్నర్ మాట్లాడుకున్నారు.
also read:ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజభవన్ లో తమిళిసైతో కేసిఆర్ (ఫోటోలు)
తెలంగాణ చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించే కార్యక్రమం తర్వాత తేనీటికి వెళ్లేందుకు ముందుగా మీరు వెళ్లాలని గవర్నర్, కేసీఆర్ లు దారి చూపుకున్నారు. తొలుత గవర్నర్ వెళ్లిన తర్వాత ఆ వెంటనే కేసీఆర్ వేదిక దిగి తేనీరు సేవించేందుకు వెళ్లారు.ఈ సమయంలో వేదిక కింద ఉన్న ప్రముఖులు కేసీఆర్ తో కరచాలనం చేశారు.
గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. అయితే ఇవాళ్టి పరిణామాలు ఈ గ్యాప్ నకు చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా ప్రారంభమైంది. అయితే చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికే ఈ నవ్వులు పరిమితమౌతాయా లేదా అనేది భవిష్యత్తు తేల్చనుంది.
Telangana ప్రభుత్వం తనను అవమానపరుస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ విషయమై తెలంగాణ సర్కార్ వ్యవహరించిన తీరును కూడా ఆమె ప్రస్తావించారు. గతంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళా దర్బార్ నిర్వహించడంపై టీఆర్ఎస్ సహా కొన్ని పార్టీలు గవర్నర్ తమిళిసై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే మహిళా దర్బార్ నిర్వహించడాన్ని గవర్నర్ సమర్ధించుకున్నారు. మహిళా దర్బార్ నిర్వహణ సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఆపే శక్తి ఎవరికీ కూడా లేదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని పరోక్షంగా కేసీఆర్ సర్కార్ కు ఆమె చురకలంటించారు.
రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గ్యాంగ్ రేప్ ఘటనలో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని ఆమె చెప్పారు. మహిళలు సమాజంలో బాధపడుతున్న సమయంలో వారిని ఆదుకొనేందుకు తాను ముందుంటాన్నారు.