హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. కోగంటి సత్యం హత్య చేశారని రాంప్రసాద్ కుటుంబం ఆరోపిస్తుంటే లేదు తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి  మీడియాముందుకు వచ్చాడు.  

రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ హత్య చేయమంటేనే తాను హత్య చేసినట్లు చెప్పుకొచ్చారు. రాంప్రసాద్ ను హత్య చేస్తే డబ్బులొస్తాయని రూ.15 లక్షలు ఇస్తానని చెప్పడంతోనే తాను హత్య చేసినట్లు చెప్పుకొచ్చారు. రాంప్రసాద్ హత్యతో ఊర శ్రీనివాస్ తోపాటు తన శిష్యులకు సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. 

అయితే ఈ హత్యపై అసలు శ్యామం ఎవరో తనకు తెలియదన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఊర శ్రీనివాస్. రాంప్రసాద్ హత్యలో తన ప్రమేయం ఉంటే దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు. పోలీసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాంప్రసాద్ ను హత్య చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తప్పించుకునేందుకే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఊర శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

ఇకపోతే రాంప్రసాద్ ను తానే హత్య చేశానని సోమవారం మధ్యాహ్నాం శ్యాం అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను రాంప్రసాద్ వేధింపులకు గురి చేశారని అందువల్లే తాను హత్య చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు. 

ఈ హత్యలో రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ ప్రమేయం ఉందన్నారు. అతని సహకారంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. పంజాగుట్ట ఆఫీసులో రాంప్రసాద్ దొరుకుతాడని ఊర శ్రీనివాస్ చెప్పడంతో 15 రోజులపాటు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

రాంప్రసాద్‌ను నేనే హత్య చేశా: శ్యామ్

రాంప్రసాద్ హత్య కేసు: కారు యజమానిని గుర్తించిన పోలీసులు

రాంప్రసాద్ హత్య: పోలీసులు అదుపులో కోగంటి సత్యం అల్లుడు

హైదరాబాద్‌లో బెజవాడ పారిశ్రామికవేత్త హత్య: కోగంటి సత్యంపై ఆరోపణలు