ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల మండలం కుదునూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గిరిజన నేత రాఘవయ్య మృతి చెందారు. 

చర్ల మండలం కుదునూరులో దళితులు, గిరిజనుల మధ్య ఆదివారం రాత్రి  ఘర్షణ చోటు చేసుకొంది. చాలా రోజులుగా ఈ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  ఈ ఘర్షణలో భాగంగా ఆదివారం నాడు ఓ వర్గం వారు గిరిజనులపై దాడికి దిగారు.

రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో రాఘవయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాఘవయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ ఘటనతో ఏజెన్సీ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది.  ఏజెన్సీ గ్రామాల్లో పోడు భూముల విషయంలో  గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం సాగుతోంది.