మిర్యాలగూడ: మారుతీరావును చూసేందుకు స్మశానవాటికకు ముందు వచ్చిన సమయంలో  శ్రవణ్ కుమార్‌ కూతురే తనను నెట్టివేశారని  అమృత చెప్పారు.  కనీసం ముట్టుకోకుండా చూడాలని శ్రవణ్  అరిచాడని ఆమె ఆరోపించారు.

Also read:అమ్మ నా దగ్గరికి వస్తే చూసుకొంటా, శ్రవణ్‌తోనే భయం: అమృత

సోమవారం నాడు  మారుతీరావు  అంత్యక్రియలు పూర్తైన తర్వాత  అమృత మీడియాతో మాట్లాడారు. మారుతీరావును కడసారి చూసేందుకు స్మశాన వాటికకు  వెళ్లిన సమయంలో  తనను ఎందుకు అడ్డుకొన్నారని అమృత ప్రశ్నించారు.

స్మశాన వాటికలో శ్రవణ్ కుమార్ కూతురు తనను నెట్టివేసిందన్నారు. తనను ముట్టుకోకుండా చూడాలని శ్రవణ్ అరిచాడని  అమృత  ఆరోపించారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న తన తల్లిని ఓదార్చేందుకు వెళ్లానని అమృత చెప్పారు. కానీ తన తల్లిని ఓదార్చే ప్రయత్నాన్ని కూడ అడ్డుకొన్నారని చెప్పారు. 

ప్రణయ్ హత్య కేసులో  శాస్త్రీయ ఆధారాలను పోలీసులు సేకరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు తన తండ్రి కాదని  అమృత చెప్పారు.

తన తండ్రి పేరు మీద ఏ మేరకు ఆస్తులు ఉన్నాయనే విషయం తనకు తెలియదన్నారు. ఆస్తులపై కూడ తనకు ఎలాంటి  ఆశలు లేవన్నారు. నీవు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొంటే  ఆస్తి అంతా తన పేరున రాసిస్తానని శ్రవణ్ తనతో చెప్పేవాడని ఆమె గుర్తు చేశారు.

శ్రవణ్ రెచ్చగొట్టడం వల్లే మారుతీరావు తప్పు చేసి ఉన్నాడన్నారు. శ్రవణ్ కుమార్ మాటకు మారుతీరావు, మారుతీరావు భార్య  వింటారన్నారు. ఈ విషయం మిర్యాలగూడ ప్రజలకు తెలుసునని చెప్పారు.