తన భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందన్నారు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె... తన భర్త ధైర్య సాహసాలను ప్రదర్శించారని, అందరికీ ఆదర్శంగా నిలిచారని సంతోషి ఉద్వేగంగా చెప్పారు.

Also Read:తండ్రి చితికి తాతతో కలిసి నిప్పుపెట్టిన కల్నల్ సంతోష్ కొడుకు

భారత్- చైనా సరిహద్దుల్లో ఏం జరిగిందో లోకానికి తెలుసునన్నారు. తన భర్తతో చివరిసారిగా జూన్ 14 రాత్రి సమయంలో మాట్లాడానని చెప్పిన సంతోషి.. ఇలా జరుగుతుందని ఊహించలేదని సంతోషి కన్నీటిపర్యంతమయ్యారు.

20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో... చైనాకు గట్టి జవాబు చెప్పాలని ఆమె ప్రధాని మోడీని కోరారు. మరోవైపు చైనా వస్తువులను నిషేధించాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు సంతోషి మద్ధతు ప్రకటించారు. చైనా వ్యవహరాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఆమె విజ్ఙప్తి చేశారు.

Also Read:ఎక్కడున్నావురా కొడుకా.. అమరవీరుడు సంతోష్ కు ఓ తల్లి నివాళి..

కాగా గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు... గురువారం మధ్యాహ్నం ఆయన స్వస్థలం సూర్యాపేటలో జరిగాయి. సంతోష్ బాబు అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట వాసులు దారిపొడవునా అమరవీరుడిపై పూలు చల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు.