రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ఇంట్లో దిగబెడతానని చెప్పి వివాహితపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also read:మహిళలు స్నానం చేస్తుండగా మొబైల్‌తో రికార్డ్: నిందితుడికి దేహశుద్ది, అరెస్ట్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవల్లి గ్రామానికి  చెందిన మహిళ పక్కనే ఉన్న మరో గ్రామానికి వెళ్లింది. స్వగ్రామానికి  వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తోంది.ఇదే దారిలో మహిళ నివాసం ఉంటున్న గ్రామానికి చెందిన ప్రవీణ్ కారులో వస్తున్నాడు. ఆమెను చూసి గ్రామంలో దిగబెడతానని ఆమెను కారులో కూర్చోమన్నాడు.

ప్రవీణ్ మాటలను నమ్మిన ఆమె వెంటనే అతడి కారులో కూర్చుంది.గ్రామానికి వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో కారును తీసుకెళ్లాడు. కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిందితుడి నుండి బాధితురాలు తప్పించుకొని  స్వగ్రామానికి చేరుకొంది. ఈ విషయమై కుటుంబసభ్యులకు చెప్పింది. బాధితురాలు శనివారం నాడు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.