హైదరాబాద్:మహిళల స్నానాల గదిలో సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఫణీందర్ కొంత కాలం క్రితం కొండాపూర్‌కు వలస వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన  ఫణీందర్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.

Also read:క్లినిక్‌లో ఉదయం వైద్యం, రాత్రి వ్యభిచారం: పక్కా స్కెచ్‌‌తో ముఠా గుట్టు రట్టు

భార్యతో కలిసి మసీద్‌బండలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఫణీందర్‌క‌ు వక్రబుద్ది కలిగింది.తన ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో నివాసం ఉండే మహిళలు స్నానానికి వెళ్లే సమయంలో  తన ఇంటి బాల్కనీ రెయిలింగ్ ఎక్కి  ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంద్రం నుండి సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు తీసేవాడు.

 రెండు రోజుల క్రితం అతను  వీడియో తీస్తున్న సమయంలో ఓ మహిళ ఈ విషయాన్ని గుర్తించింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని నిందితుడిని చితకబాదారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు నిందితుడి నుండి సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.