ఓ దొంగ దుర్గామాత కిరీటం కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నాడు. దేవత సొత్తు కదా... కొట్టేస్తే పాపం తగులుతుందేమోనని భయమేసింది. దీంతో.. ముందుగానే తన తప్పుకి ప్రాయచ్చితం చేసుకున్నాడు. అమ్మవారి విగ్రహం ముందు నిలబడి గుంజీలు తీసి.. చెంపలు వాయించుకున్నాడు. ఆ తర్వాత అమ్మవారి వెండి కిరీటాన్ని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం.

ALSO READ:భర్తకు మజ్జిగలో నవ వధువు విషం: ట్విస్ట్ ఇదీ...

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ఆలయానికి బుధవారం ఉదయం 6గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. దుర్గా మాత గర్భగుడిలోకి ప్రవేశించి.. దాదాపు అరగంట పాటు పూజలు చేశాడు. రెండు చేతులతో చెవులు పట్టుకొని గుంజీలు కూడా తీశాడు. తాను చేయబోయే తప్పుకు ముందుగానే శిక్షించుకొని ఆ ఆర్వాత అమ్మవారి వెండి విగ్రహాన్ని తీసుకున్నాడు.

ALSO READ:బట్టలషాపులో పనిచేసే అమ్మాయిపై కత్తితో దాడి..

తన ఒంటిపై ఉన్న చొక్కాను తొలగించి  అందులో అమ్మవారి వెండి విగ్రహాన్ని ఉంచి దానికి చంకలో పెట్టుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. గుడి బయట ఉన్న తన బైక్ ఎక్కి పరారైనట్లు గుడిలోనీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ వెండి కిరీటం 35తులాలు ఉంటుందని.. దాని విలువ రూ.పదివేలకు పైగానే ఉంటుందని చెప్పారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.