Asianet News TeluguAsianet News Telugu

యూకేలో హైదారాబాద్ విద్యార్థిని మృతి.. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కేంద్రానికి తల్లిదండ్రుల అభ్యర్థన

మాస్టర్స్ చదివేందుకు యూకేకు వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో ఆమె ఈ నెల 12వ తేదీన మరణించారు. అయితే ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందు సాయం చేయాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Hyderabad student dies in UK. Parents request to take daughter's body home..ISR
Author
First Published Oct 14, 2023, 5:44 PM IST

ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని అక్కడ అనారోగ్యంతో మరణించారు. అయితే ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా తమ బిడ్డ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు సహకరించాలని బాధిత కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

దారుణం.. మాదక ద్రవ్యాలకు బానిసై.. కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం..

వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన సామలేటి దివ్య (24) తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో జీవించేవారు. అయితే ఆమె సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ చదువేందుకు యూకేలోని హార్ట్ ఫోర్డ్ షైర్ యూనివర్సిటీ కి వెళ్లారు. అక్కడ తన విద్యను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. 

తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ యూకేలో లేకపోవడతో స్నేహితులు ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు మెదడులో పలు గడ్డలు ఏర్పడ్డాయని గుర్తించారు. అప్పటి నుంచి ఆమె కేంబ్రిడ్జిలోని అడెన్ బ్రూక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె గురువారం ఉదయం చనిపోయారు. 

తాగుడుకు బానిసై భార్యతో గొడవ.. నాలుగు నెలల గర్భిణీకి నిప్పంటించి, కుమారుడితో పరారైన భర్త.

యూకేలో ఆమెకు కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు, స్టడీ లోన్ కొంత చెల్లించేందుకు ఆమె స్నేహితులు ముందుకొచ్చారు. అయితే మరిన్ని నిధులు అవసరం కావడంతో తల్లితండ్రులు దాతల నుంచి విరాళాలు కోరుతున్నారు. దీని కోసం వారు గోఫండ్ మీ.కమ్ ద్వారా ప్రజల నుంచి విరాళాలు కోరారు. తమ బిడ్డను స్వదేశానికి తీసుకురావడంలో సాయం చేయాలని నిస్సాహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios