దారుణం.. మాదక ద్రవ్యాలకు బానిసై.. కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం..
మాదక ద్రవ్యాలకు బానిసైన ఓ వ్యక్తి తన కూతురుపై దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. కొన్ని సార్లు సొంత వాళ్ల దగ్గర కూడా వారికి రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ కు చెందిన మక్సూద్ తన కుటుంబంతో కలిసి తూర్పు ఢిల్లీలో జీవిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు. శుక్రవారం అతడి భార్య పని నిమిత్తం బయటకు వెళ్లింది. మైనర్ బాలిక ఒంటరిగా ఉంది. ఆ సమయంలో మక్సూద్ ఇంటికి వచ్చాడు.
బాలిక ఒంటరిగా ఉండటన్ని గమనించిన అతడు కామవాంఛతో దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా అత్యాచారానికి ఒడిగట్టాడు. సాయంత్రం సమయంలో తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తండ్రి తనపై జరిపిన దారుణాన్ని వివరించింది. అనంతరం బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది.
తన భర్త కూతురుపై జరిపిన దారుణ ఘటనను వారికి వివరించింది. తల్లి సమక్షంలో బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376(2)(ఎన్), 506, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి తూర్పు ఢిల్లీలోని ఎల్బీఎస్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మక్సూద్ ను అరెస్టు చేశారు.
ఈ నెల 6వ తేదీన కూడా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. జైసల్వేర్ పట్టణంలోని ఓ కాలనీలో రాకేష్ తన భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి జీవిస్తున్నాడు. పెద్ద కూతురు వయస్సు ఐదేళ్ల కాగా.. చిన్న కూతురు వయస్సు ఎనిమిదేళ్లు. రాకేష్ వ్యవసాయ పనులు చేస్తూ జీవోనోపాధి పొందేవాడు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో అతడు మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం తాగుతూ కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. దీంతో రాకేష్ భార్యే ఇంటి బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. స్థానికంగా దొరికే పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో ఇటీవల ఒక రోజు రాకేష్ ఫుల్లుగా మద్యం తాగాడు.
తరువాత ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో పెద్ద కూతురు బయటకు వెళ్లింది.. తల్లి పనుల కోసం వెళ్లింది. చిన్న కుమార్తె మాత్రమే ఇంట్లో ఉంది. ఫుల్లుగా మద్యం తాగి ఉన్న రాకేష్ వావి వరసలు మరిచి కూతురపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో పెద్ద కూతురు ఇంటికి వచ్చింది. తండ్రి.. తన చెల్లెల్లిపై చేస్తున్న దారుణాన్ని చూసి షాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని వెంటనే తన తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాలి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేశారు.