Asianet News TeluguAsianet News Telugu

Hyderabad: రేపిస్ట్ నుంచి ఆరేళ్ల బాలికను కాపాడిన ర్యాపిడో డ్రైవర్.. సమయస్ఫూర్తితో ఇద్దరినీ పేరేంటని అడిగాడు!

హైదరాబాద్‌లో ఓ ర్యాపిడో డ్రైవర్ ఆరేళ్ల బాలికను రేపిస్ట్ కబంధ హస్తాల నుంచి కాపాడాడు. ప్రయాణికుడి కోసం ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్ వద్ద వెయిట్ చేస్తుండగా మూలగా ఆరేళ్ల బాలికపై రేప్ చేయడానికి సిద్ధమవుతున్న ఓ యువకుడిని ఆపాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను కాపాడాడు.
 

hyderabad rapido drivers saves girl from rapis kms
Author
First Published May 9, 2023, 7:47 PM IST

హైదరాబాద్: ఓ ర్యాపిడో డ్రైవర్ సకాలంలో తీసుకున్న నిర్ణయం ఆరేళ్ల జీవితాన్ని రక్షించింది. మరికాసేపట్లో రేపిస్ట్ చేతిలో నలిగిపోయే పసి కూనను ఆ ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఆ పాపకు తాను తండ్రి అంటూ దుండగుడు బుకాయించే ప్రయత్నం చేయగా.. తెలివిగా ఆటకట్టించాడు. పోలీసులకు ఫోన్ చేసి పాపను కాపాడాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది.

26 ఏళ్ల కారంతోట్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల్‌కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారాలని హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. పార్ట్ టైమ్‌గా ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేయగా.. ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లి ప్రయాణికుడి కోసం కళ్యాణ్ వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయంలో మెట్రో స్టేషన్ వద్ద మూలగా చీకటిలో నుంచి చిన్న పాప అరుపులు ఆయనకు వినిపించాయి.

‘అటు వైపుగా వెళ్లగా.. 19 ఏళ్ల దుండగుడు ఆరేళ్ల బాలిక పైకి నెట్టేసుకుంటున్నాడు. ఆ బాలిక బాధితురాలిగా కనిపించింది. నిలదీయగా.. ఆ ఆగంతుకుడు బాలికకు తాను తండ్రి అని చెప్పాడు. కానీ, నమ్మశక్యంగా లేదు. ఇంతలో బాలిక అతను తన తండ్రి కాదని చెప్పింది. ఆమె తండ్రి మరణించాడని, తల్లితో ఉంటున్నదని చెప్పింది. దీంతో ఆ బాలిక పేరేమిటని దుండుగుడిని అడిగా, ఆ తర్వాత బాలికను అడిగాను. ఇద్దరు చెప్పిన పేర్లే వేర్వేరుగా ఉన్నాయి. దీంతో పోలీసులకు (100) ఫోన్ చేశాను’ అని కళ్యాణ్ చెప్పాడు.

Also Read: ఉత్తరాఖండ్‌లో రాత్రిపూట ఎద్దుపై స్వారీ చేసిన యువకుడు.. వీడియో వైరల్

పంజాగుట్ట పోలీసులు అక్కడికి వచ్చేసి ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఆ యువకుడిని పండ్లు అమ్ముకునే అఫ్రోజ్‌గా గుర్తించారు. బాలికను కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. రెండు గంటల పాటు బాలిక కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చారు. సురక్షితంగా ఉన్న బాలికను చూసి ఊపిరిపీల్చుకున్నారు.

ర్యాపిడో డ్రైవర్ కళ్యాణ్ ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని విమెన్ సేఫ్టీ, అదనపు డీజీపీ శిఖా గోయల్ అభినందించారు. యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని, ఎక్కడైనా నేరం జరుగుతున్నట్టు అనుమానిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అలర్ట్ చేయాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios