ఉత్తరాఖండ్‌లో రాత్రిపూట ఎద్దుపై స్వారీ చేసిన యువకుడు.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లో ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రిపూట వీధుల్లో ఆ ఎద్దును పరుగు పెట్టిస్తుంటే జనాలు భయాలకు లోనయ్యారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తున్న వీడియో కనిపించింది. రాత్రిపూట వీధుల్లో ఎద్దుపై స్వారీ చేస్తుంటే అక్కడక్కడ జనాలు బెంబేలెత్తుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఏరియాలో తపోవన్ ఏరియాలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు వైరల్ వీడియో కోసం ప్రయత్నించాడు. ఆ వీడియోలో సదరు వ్యక్తి ఎద్దుపై స్వారీ చేశాడు. రాత్రిపూట ఆ ప్రయత్నం చాలా మందిని బెంబేలెత్తించింది. ఈ వీడియో పోలీసులకు దృష్టికి వచ్చింది. వెంటనే యాక్షన్‌లోకి దిగారు. జంతువులతో తప్పుగా వ్యవహరించినందుకూ ఆయనపై కేసు ఫైల్ అయింది.
Also Read: మోడీకి 30 మంది దత్తపుత్రులు.. జగన్‌కు 30 మంది సలహాదారులు, వారిద్దరిదీ రహస్య బంధం : సీపీఐ నారాయణ
ఆ యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మళ్లీ ఇలా జంతువులతో క్రూరంగా వ్యవహరించరాదని హెచ్చరించారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ పోలీసులు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని తపోవన్‌లో ఎద్దుపై ఓ యువకుడు స్వారీ చేశాడని వివరించారు. మే 5వ తేదీన రాత్రిపూట ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని భవిష్యత్‌లో మళ్లీ జంతువులను హింసించరాదని హెచ్చరించినట్టు పేర్కొన్నారు.