Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో వ్యాపారస్తులకు పోలీస్ లైసెన్స్ : ఏప్రిల్ నుండి అమలు

హైద్రాబాద్ నగరంలో  వ్యాపారలు ఇక నుండి పోలీస్ లైసెన్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ఏడాది ఏప్రిల్ నుండి  పోలీస్ లైసెన్స్ ను పోలీస్ శాఖ  తప్పనిసరి చేయనుంది.  
 

Hyderabad  Police  to  introduce Police license For Business
Author
First Published Jan 25, 2023, 10:53 AM IST


హైదరాబాద్:నగరంలో  వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా  పోలీస్ లైసెన్స్  తీసుకోవాలనే నిబంధన అమల్లోకి రానుంది.  ఈ ఏడాది ఏప్రిల్  నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. నగరంలోని  పలు వ్యాపార సంస్థల్లో  తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా  పలువురు మృత్యువాత పడుతున్నారు.ఈ నెల  19వ తేదీన  సికింద్రాబాద్ డెక్కన్  మాల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో   పోలీస్ లైసెన్స్ ను అమల్లోకి తీసుకు రావాలని  ప్రభుత్వం భావిస్తుంది. 

2014 వరకు  వ్యాపారాలు నిర్వహించాలనుకున్నవారంతా  పోలీస్ లైసెన్స్ తీసుకొనే వారు.  అయితే  2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  వ్యాపారస్తులు  పోలీస్ లైసెన్స్ తీసుకోవడం అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.  ఏ వ్యాపారం చేస్తున్నారు. ఎంతమంది పనిచేస్తారు,  ఈ వ్యాపారానికి  అవసరమైన మెటీరియల్ ఎక్కడి నుడి తెస్తారు,. అగ్నిమాపక శాఖతో పాటు ఇతర శాఖల లైసెన్స్ లు  ఉన్నాయా అనే  విషయాన్ని   లైసెన్సులు జారీ చేసే సమయంలో పోలీసులు పరిశీలించనున్నారు.

గత తొమ్మిది  ఏళ్లుగా  తెలంగాణ రాష్ట్రంలో  పోలీస్ లైసెన్సులు లేవు. దీంతో  వ్యాపార సంస్థలకు సంబంధించిన సమాచారం  పోలీసుల వద్ద లేకుండా  పోయింది. పోలీస్ లైసెన్స్ ను అమల్లోకి తీసుకు వస్తే  వ్యాపార సంస్థల  సమాచారం పోలీసుల వద్ద  కూడా  ఉంటుంది.  ఏదైనా ఘటన జరిగిన సమయంలో  వ్యాపార సంస్థలకు సంబంధించిన  సమాచారం పోలీసులు దర్యాప్తునకు మేలు కల్గించే అవకాశం లేకపోలేదు. ఆయా వ్యాపారాన్ని బట్టి  లైసెన్స్   ఫీజు చెల్లించాలి.  కనీస ఫీజు  రూ. 1000  నుండి ప్రారంభం కానుంది

also read:సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత: టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ

టీ స్టాల్ నుండి  రెస్టారెంట్  వరకు   పోలీస్ లైసెన్స్ తీసుకోవాల్సిందే.  ప్రతి ఏటా  ఏప్రిల్ మాసంలో  పోలీస్ లైసెన్స్  జారీ చేయనున్నారు. ఈ ఏడాది లైసెన్స్ తీసుకొంటే  వచ్చే ఏడాది మార్చి  31 వరకు  ఆ లైసెన్స్ అమల్లో ఉంటుంది.   ప్రతి ఏటా లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ లైసెన్స్ కు సంబంధించి  వ్యాపారులకు  పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.  hyderabadpolice.gov.in వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాలని  సూచిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios