సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత: టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేతకు  జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.  ఇతర భవనాలకు  నష్టం వాటిల్లకుండా ఉండేలా  భవనం కూల్చివేయాలని  జీహెచ్ఎంసీ సూచించింది. 

GHMC  Invites Tenders for  Demolition  Secunderabad  Deccan  Mall

హైదరాబాద్: సికింద్రాబాద్  రాంగోపాల్ పేట  డెక్కన్  మాల్   కూల్చివేతకు  జీహెచ్ఎంసీ  అధికారులు  టెండర్లను పిలిచారు.    అగ్ని ప్రమాదం కారణంగా ఈ భవనం పూర్తిగా బలహీనపడింది. దీంతో  ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకన్నారు.   భవనం కూల్చివేత  విషయంలో  పక్కనే  ఉ్న ఇతర భవనాలకు  నష్టం వాటిల్లకుండా  ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు. 

1890 చదరపు అడుగుల్లో డెక్కన్  స్పోర్ట్స్ వేర్ భవనం నిర్మించారు.   ఈ భవనం కూల్చివేతకు    రూ. 33.86 లక్షలతో టెండర్లను ఆహ్వానించారు.  భవనం కూల్చివేతకు  ఆధునాతన యంత్రాలు వాడాలని సూచించారు.  భవనం కూల్చివేసే సమయంలో  చుట్టుపక్కల వారికి  ప్రమాదం జరగకుండా  అధికారులు కోరారు.  

ఈ నెల  19వ తేదీన   రాంగోపాల్ పేట  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా భవనంలో  ఆరు అంతస్థులు  పూర్తిగా దెబ్బతిన్నాయి.  సుమారు  11 గంటల పాటు  కష్టపడి  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో  ఉన్న సింథటిక్ , టైర్లు ఇతర మెటీరియల్  మంటలు త్వరగా  వ్యాప్తి చెందడానికి కారణంగా మారిందనే   అగ్నిమాపక సిబ్బంది  అభిప్రాయపడ్డారు.

ఈ భవనం నుండి నలుగురిని  అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే  ఈ భవనంలో విధులకు వెళ్లిన  వారిలో  ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే  ఈ భవనంలోని సెల్లార్ లో  ఒక అస్థిపంజరం  లభ్యమైంది. ఈ ఆస్థి పంజరం నమూనాలను  ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.  ఈ ఆస్థి పంజరం ఎవరిదనే  విషయాన్ని నిర్ధారించనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios