Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాద్ (hyderabad) మహానగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు (chain snatching) పాల్పడిన నిందితుడు ఉమేష్ ఖతిక్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ఈ నెల 19న ఉమేష్ ఖతిక్ వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.

Hyderabad Police identified Serial chain snatcher
Author
Hyderabad, First Published Jan 22, 2022, 9:53 AM IST

హైదరాబాద్ (hyderabad) మహానగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు (chain snatching) పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ఈ నెల 19న వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుడుని రాజస్తాన్‌కు చెందిన ఉమేష్ ఖతిక్‌గా గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలింపు చేపట్టారు. నిందితుడి ఫొటోను కూడా విడుదల చేశారు. గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఉమేష్ ఖతిక్‌పై చోరీ కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిందితుడు ఉమేష్ ఖతిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇక, ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చిన ఉమేష్.. ఆ మరుసటి రోజు చైన్న స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అనంతరం అతడు వరంగల్ వెళ్లి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు దుండగుడు  దొంగ‌త‌నం మొద‌లు పెట్టి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు దానిని కొన‌సాగించాడు. ఈ స‌మ‌యంలో ఐదుగురి మెడ‌ల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఆరో సారి కూడా  ప్ర‌య‌త్నించినా.. అందులో విఫ‌ల‌మ‌య్యాడు. గుర్తు తెలియ‌ని ఆ దొంగ మొద‌ట దొంగ‌లించిన బైక్ తో  మారేడుపల్లి (maredupalli) తుకారాంగేట్‌ (thukarmgate), పేటబషీర్‌బాద్‌ (petabasherbad), మేడిపల్లిలో (medipalli)ప్రాంతాల్లో దొంగ‌త‌నం చేశాడు. ఈ స‌మ‌యంలో అత‌డు క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. 

సంజీవ‌య్య న‌గ‌ర్ (sanjeevaiah nagar) ప్రాంతానికి యాభై ఐదేళ్ల విజయ తన కూతురిని కలవడానికి సమీపంలోని నర్సింగ్ హోమ్‌కి (nusing home) వెళ్ళింది. ఇంటికి తిరిగి న‌డుచుకుంటూ వ‌స్తున్న క్ర‌మంలో ఇంద్రపురి రైల్వే కాలనీ వద్ద కు చేరుకోగానే.. బైక్ (bike) ఓ వ‌చ్చిన ఓ దొంగ ఆమె మెడ‌లో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.   చైన్ లాక్కొనే స‌మ‌యంలో విజ‌య కింద‌ప‌డిపోయారు. దీంతో ఆమెకు గాయాల‌య్యాయ‌ని మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎం మత్తయ్య తెలిపారు.

మారెడుప‌ల్లిలో దొంగ‌త‌నం చేసిన అనంత‌రం నిందితుడు పక్కనే ఉన్న తుకారాంగేట్ (thukaram gate) పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించారు. ఈ సారి అతను 65 ఏళ్ల రాంబాయిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఆమె రోడ్డు ప‌క్క‌న న‌డుస్తున్న స‌మ‌యంలో ఎదురుగా బైక్ పై వ‌చ్చిన దొంగ మ‌హిళ మెడ‌లో నుంచి వచ్చి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అనంత‌రం అక్క‌డి నుంచి సైబరాబాద్‌లోకి ప్రవేశించి రెండు స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.మ‌రో గంట‌లోనే ఇంకో దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అది విఫ‌ల‌మైంది.ఈమేరకు తుకారాంగేట్, మారేడుపల్లిలో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

పోలీసులు (police)విచార‌ణ చేప‌ట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా (cctv) ఫుటేజ్ ల‌ను ప‌రిశీలించారు. ఈ దొంగ‌త‌నాలకు నిందితుడు ఒకే బైక్ ను ఉప‌యోగించిన‌ట్టు నిర్దారించుకున్నారు. అయితే ఆ బైక్‌ను నిందితుడు దొంగిలించినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios