హైద్రాబాద్ టెక్కీ నారాయణరెడ్డి హత్య: రూ. 4.50 లక్షలకు సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం
హైద్రాబాద్ కూకట్‌పల్లికి చెందిన టెక్కీ నాారాయణరెడ్డి హత్యకు సుఫారీ గ్యాంగ్ ను వెంకటేశ్వర్ రెడ్డి ఉపయోగించారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. రూ. 4.50 లక్షలు తీసుకొని నారాయణరెడ్డిని శ్రీనివాస్ రెడ్డితో పాాటు మరో ఇద్దరు హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్:Hyderabad నగరం KPHBకి చెందిన టెక్కీ Narayna Reddy హత్యకు సుఫారీ గ్యాంగ్ ను వెంకటేశ్వర్ రెడ్డి ఉపయోగించాడని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలను గెుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి Ongole జిల్లాలోని రాజువారిపాలెం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తనకు దూరపు బంధువైన యువతిని పెళ్లి చేసుకొన్నారు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత ఆ యువతిని నారాయణరెడ్డి వివాహం చేసుకొన్నాడు. ఒకే సామాజిక వర్గమైన కూడా నారాయణరెడ్డితో తమ కూతురు వివాహం వెంకటేశ్వర్ రెడ్డికి ఇష్టం లేదు. దీంతో నారాయణరెడ్డి తాను ప్రేమించిన యువతిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాలకు తియకుండా రహస్య జీవితం గడిపాడు. ఈ క్రమంలోనే నారాయణరెడ్డి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన వెంకటేశ్వర్ రెడ్డి నారాయణరెడ్డిని తన కూతురికి ఘనంగా Marriage జరిపిస్తామని చెప్పి నమ్మించాడు. తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత Venkateshwar Reddy తన కూతురిని నారాయణరెడ్డి వద్దకు పంపలేదు. తన భార్య కోసం నారాయణరెడ్డి High Court ను కూడా ఆశ్రయించాడు.ఇదిలా ఉండగా తన కూతురికి వేరేవాళ్లతో వివాహం చేసేందుకు వెంకటేశ్వర్ రెడ్డి ప్రయత్నాలను ప్రారంభించాడు. అయితే నారాయణరెడ్దితోనే తాను కాపురం చేస్తానని కూతురు తెగేసి చెప్పింది. ఇతరులతో వివాహ సంబంధాలకు కూడా ఆమె ఒప్పుకోలేదు. దీంతో కూతురిని ఇంట్లోనే గృహ నిర్భంధం చేసిన వెంకటేశ్వర్ రెడ్డి తన కూతురు కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణరెడ్డి హత్య కేసు దర్యాప్తు సమయంలో ఈ విషయాలను గురించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
దీంతో నారాయణరెడ్డిని హత్య చేయించాలని వెంకటేశ్వర్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ మేరకు తనకు బంధువైన Srinivas Reddy ని వెంకటేశ్వర్ రెడ్డి సంప్రదించాడు. రూ. 5 లక్షలను శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశాడు. అయితే చివరకు రూ. 4.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది జూన్ 24న గిద్దలూర్ కు చెందిన ఆశోక్ , kurnool కు చెందిన కాశీని తీసుకొని హైద్రాబాద్ కు వచ్చాడు. జూన్ 27న నారాయణరెడ్డిని నమ్మించి తీసుకెళ్లిన శ్రీనివాస్ రెడ్డి అతని గ్యాంగ్ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నారాయణరెడ్డి మృతదేహన్ని Sanga Reddy జిల్లాలోని Jinnaram అటవీ ప్రాంతంలో వేశారు. మృతదేహం గుర్తు పట్టకుండా ఉండేందుకు గాను దగ్దం చేశారు.
also read:బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 25యేళ్ల జైలు శిక్ష, జరిమానా..
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు నారాయణ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణరెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ హత్య విషయం వెలుగు చూసింది. శ్రీనివాస్ రెడ్డి నారాయణరెడ్డికి పోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు సుఫారీ గ్యాంగ్ ద్వాారా నారాయణరెడ్డిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారని మీడియా రిపోర్టు చేసింది.