రూ. 22 లక్షలతో బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ పరారీ: ప్రవీణ్ బైక్ చిట్యాలలో గుర్తింపు

హైద్రాబాద్ వనస్థలిపురం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచీలో క్యాసియర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన బైక్ ను  పోలీసులు గుర్తించారు. 

Hyderabad Police Found Bank Of Baroda Cashier Praveen Kumar Bike In Nalgonda district

హైదరాబాద్: Bank Of Baroda  వనస్థలిపురం బ్రాంచీకి చెందిన క్యాషియర్ Praveen Kumar  బైక్ ను ఉమ్మడి నల్గొండ జిల్లాలోని Chityalaలో పోలీసులు గుర్తించారు. శుక్రవారం నాడు సాయంత్రం వరకు తాను బ్యాంకుకు వస్తానని ప్రవీణ్ కుమార్ సెల్ఫీ వీడియోను కూడా పంపాడు.  ప్రవీణ్ కుమార్ కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వనస్థలిపుంర బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలో cashier గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ పై గురువారం నాడే సస్పెన్షన్ వేటు వేసింది బ్యాంకు యాజమాన్యం.

also read:వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం .. క్యాషియర్‌పై సస్పెన్షన్ వేటు

బ్యాంకు ఆఫ్ బరోడా వనస్థలిపురం బ్రాంచీలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు.ఈ నెల 10వ తేదీన యధావిధిగా విదులకు హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు తనకు కడుపులో నొప్పిగా ఉందని  బ్యాంకు మేనేజర్ కు చెప్పాడు. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ బ్యాంకు నుండి వెళ్లిపోయాడు. బ్యాంకు ముగిసే సమయమైనా కూడా ప్రవీణ్ కుమార్ బ్యాంకుకు రాలేదు. ప్రవీణ్ కుమార్ కు బ్యాంకు సిబ్బంది ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. అనుమానం వచ్చి ప్రవీణ్ కుమార్ క్యాబిన్ చెక్ చేస్తే రూ. 22 లక్షలు మాయమైనట్టుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. 

వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి బ్యాంకు కు వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ మేసేజ్ లో పేర్కొన్నాడు. 

ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన సెల్ పోన్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే నిన్ననే  ప్రవీణ్ కుమార్ మరో సెల్ఫీ వీడియోను పంపాడు. ఈ డబ్బులు తాను తీసుకెళ్లలేదని పేర్కొన్నాడు. బ్యాంకులో చాలా రోజుల నుండి నగదు మాయం అవుతుందని ఆయన ఆరోపించారు. బ్యాంకు ఉద్యోగులు కొందరు సెలవు దినాల్లో కూడా బ్యాంకుకు వస్తున్న విషయమై కూడా ప్రశ్నించాడు. తాను డబ్బును తీసుకెళ్తే సీసీటీవీ పుటేజీలో కన్పిస్తుంది కదా అని కూడా ప్రశ్నించారు. బ్యాంకు నగదును తీసుకొని తనపై వేస్తున్నారనే రీతిలో ప్రవీణ్ కుమార్ సెల్పీ వీడియోలో అభిప్రాయపడ్డారు.

మరో వైపు ఇవాళ సాయంత్రానికి తాను హైద్రాబాద్ కు చేరుకుంటానని కూడా ప్రవీణ్ కుమార్ మరో సెల్ఫీ వీడియోను పంపినట్టుగా సమాచారం. చిట్యాలలో ప్రవీణ్ కుమార్ బైక్ ను గుర్తించిన పోలీసులు ప్రవీణ్ చిట్యాల పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడా బైక్ ను అక్కడ పార్క్ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios