Asianet News TeluguAsianet News Telugu

జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట: బేగంపేట పోలీసుల కేసు నమోదు


సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటపై బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.బాధితుల  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదైంది., నిన్న జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. 

Hyderabad Police Files Case Against HCA in Stampede at Begumpet
Author
First Published Sep 23, 2022, 10:20 AM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్  వద్ద జరిగిన తొక్కిసలాటపై  బేగంపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నెల 25వ తేదీన ఇండియా,అస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది.ఈ మ్యాచ్ ను చూసేందుకు టికెట్ల కొనుగోలుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు నిన్న ఉదయం జింఖానా గ్రౌండ్ వద్దకు వచ్చారు.అయితే ఒక్కసారిగా గేటు వైపునకు పెద్ద ఎత్తున తోసుకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి  పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి హెచ్  సీ ఏ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టికెట్ల విక్రయానికి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ నెల 15వ తేదీన ఆన్ లైన్ టికెట్ల విక్రయం చేపట్టారు. అయితే కొద్దిసేపటికే టికెట్ల విక్రయం ముగిసిందని ప్రకటించారు. ఆఫ్ లైన్ లో  టికెట్ల విక్రయానికి సంబంధించి హెచ్ సీ ఏ, జింఖానా గ్రౌండ్స్ వద్దకు వారం రోజులు గా క్రికెట్ అభిమానులు తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కూడ స్పందించింది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కల్గించేలా వ్యవహరించే చర్యలు తీసుకొంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఆఫ్ లైన్లో టికెట్లను జింఖానా గ్రౌండ్స్ లో విక్రియిస్తామని హెచ్ సీ ఏ ప్రకటించింది. అయితే దీంతో ఈ నెల 21న పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్స్ వద్దకు క్రికెట్ అభిమానులు వచ్చారు. టికెట్ల కోసం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషయమై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తో పాటు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:అభిమానులకు షాక్.. టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి, రాత్రి 7 గంటలకు నో సేల్స్ : తేల్చిచెప్పిన అజారుద్దీన్

ఈ విషయమై రాచకొండ సీపీ మహేష్ భగవత్, స్పోర్ట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియాతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై  ఈ కమిటీని విచారణ నిర్వహించనుంది.ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఆన్ లైన్ లో టికెట్లు  కొనుగోలు కోసం డబ్బులు చెల్లించినవారికి ఇవాళ జింఖానా గ్రౌండ్స్ వద్ద  టికెట్లు జారీ చేయనున్నారు. దీంతో ఇవాళ జింఖానా గ్రౌండ్స్ వద్ద పోలీసులు భారీ మోహరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios