లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: కాంగ్రెస్ నేత వీహెచ్‌పై కేసు నమోదు

 లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుపై పోలీసులు మంగళవారం నాడు కేసు నమోదు చేశారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి కాంగ్రెస్ నేత విహెచ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Hyderabad police files case against congress leader V.Hanumantha rao for violating lock down rules
హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుపై పోలీసులు మంగళవారం నాడు కేసు నమోదు చేశారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి కాంగ్రెస్ నేత విహెచ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కరోనా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలను పోలీసులు అమలు చేశారు. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విహెచ్ నివాళులర్పించారు. దీంతో వి.హనుమంతరావుపై పోలీసులు 188, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

also read:హోమ్ క్వారంటైన్ కు నిందితుడి తరలింపు: కోర్టు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఎక్కువగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. హైద్రాబాద్ లో కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. అంతేకాదు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జోన్ల వారీగా సీఎం అధికారులను నియమించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios