హైదరాబాద్: కరోనా  కారణంగా హోం క్వారంటైన్‌ ముద్ర ఉన్న నిందితుడిని తీసుకోవడానికి  అధికారులు నిరాకరించడంతో  వ్యక్తిగత హామీతో అతడిని హోం క్వారంటైన్ లో ఉండేందుకు అనుమమతి  ఇచ్చారు జడ్జి.

హైద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిల్లో  ఓ వ్యక్తిపై పలు కేసులు ఉన్నాయి. తూర్పు మండలం పోలీసులు  శనివారం నాడు కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని  కోర్టులో హాజరుపర్చే సమయంలో  కింగ్ కోఠి ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన సమయంలో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది.

also read:తెలంగాణాలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు: నిన్నొక్కరోజే 61

నిందితుడిని రిమాండ్‌  కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే చంచల్ గూడ జైలుకు నిందితుడిని తరలించేందుకు వెళ్లారు. నిందితుడి చేతిపై హోం క్వారంటైన్ ముద్ర ఉండడంతో అతడిని తీసుకోవడానికి జైలు అధికారులు నిరాకరించారు.

అయితే ఈ విషయమై న్యాయమూర్తి  వద్దకు మరోసారి పోలీసులు నిందితుడిని తీసుకెళ్లారు. వ్యక్తిగత హామీతో నిందితుడిని హోం క్వారంటైన్ లో ఉండేందుకు న్యాయమూర్తి హామీ ఇచ్చారు.  14 రోజుల తర్వాత అనంతరం మళ్లీ చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.