బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలపై పోలీసు కేసు నమోదు..
హైదరాబాద్ నార్సింగిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోలీసు కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో ఫిర్యాదు నేపథ్యంలో బీరం హర్షవర్దన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ నార్సింగిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోలీసు కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో ఫిర్యాదు నేపథ్యంలో బీరం హర్షవర్దన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బీరంహర్షవర్దన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరు దాదాపు 60 మందితో వచ్చి తమ స్థలంలో దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ క్రమంలోనే బీరం హర్షవర్దన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలం విషయంలో గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థకు బీరంహర్షవర్దన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలకు మధ్య వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.