ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ (Fake call centre) నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని ఈ ముఠా మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. 

ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ (Fake call centre) నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని ఈ ముఠా మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు నిర్వాహకులుతో పాటు ఐదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 8 మందిని పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తోంది. 

ఏడాది కాలంగా వారు ఫేక్ కాల్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. గురుగ్రావ్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు.