వ్యాపారవేత్తల బ్లాక్ మెయిల్: హైద్రాబాద్ లో ముగ్గురి అరెస్ట్
ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ లో ప్రముఖ వ్యాపార వేత్తలను లక్ష్యంగా చేసుకని వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు.
అమెరికాలో ఉద్యోగం చేసి హైద్రాబాద్ కు వచ్చిన ప్రదీప్ అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకుడిగా పోలీసులు గుర్తించారు. ప్రదీప్ టెక్కీగా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సాధించాలనే ఉద్దేశ్యంతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ లోని ఓ స్కూల్ యజమానిని ఈ ముఠా రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని పోలీసులు గుర్తించారు. స ఇదే రకంగా పలువురు వ్యాపారవేత్తలను కూడ నిందితులు డబ్బులు డిమాండ్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
ఈ విషయమై పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ముఠాలో ప్రదీప్, శ్రీకాంత్, రాజేష్‌లు సభ్యులుగా ఉన్నారని పోలీసులు చెప్పారు.