Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో రూ.3.25 లక్షలు చోరీ, డబ్బులను టాయిలె‌లో వేశాడు: పోలీసులకు చిక్కాడిలా...


హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో ప్రముఖ వస్త్ర వ్యాపారి ప్రకాష్‌చంద్ జైన్ నివాసంలో క్యాటరింగ్ పని కోసం వచ్చిన  రజాక్ రూ.3.25 లక్షలను కాజేశాడు. అయితే ఈ డబ్బులను ఎక్కడ దాచాలో తెలియక బాత్ రూమ్ కమోడ్ లో వేసి ఫ్లష్ బటన్ నొక్కాడు. చివరికి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad police arrested Rajak for theft in Jubilee Hills
Author
Hyderabad, First Published Nov 4, 2021, 9:43 AM IST

హైదరాబాద్: ఓ ఇంట్లో పనికి వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లో theft పాల్పడ్డాడు. ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన ఇంటి యజమాని అందరిని అప్రమత్తం చేశాడు.  అయితే దీంతో భయపడిన నిందితుడు టాయిలెట్‌లో నగదును వేసి ఫ్లష్ బటన్ నొక్కాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.ఈ ఘటన Hyderabad లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ‌లో వస్త్ర వ్యాపారి ప్రకాష్‌చంద్ జైన్  తన నివాసంలో దీపావళి పూజ నిర్వహించారు. ఈ పూజ సందర్భంగా తన నివాసానికి అతిథులను ఆహ్వానించారు. అతిధులకు భోజనాలను హీరాసనా క్యాటరింగ్ సర్వీసెస్ సంస్థకు అప్పగించాడు.

also read:కేవలం 15 నిమిషాల్లో రూ.కోటి దొంగతనం.. బంగారం దుకాణంలోకి ప్రవేశించి..!

ఈ క్యాటరింగ్ సంస్థకు చెందిన 18 మంది సభ్యులు   ప్రకాష్‌చంద్ జైన్ నివాసంలో  అతిథులకు భోజనాలను అందించారు.వస్త్ర వ్యాపారి ప్రకాష్ చంద్ జైన్ అతిథులతో మాట్లాడుతుండగా అతని సోదరుడు గౌతంచంద్ జైన్ అతిథులకు వీడ్కోలు పలికే పనిలో బిజీగా ఉన్నారు.

సోదరులిద్దరూ తీరిక లేని విషయాన్ని గుర్తించిన క్యాటరింగ్ సంస్థకు చెందిన సభ్యుడు షేక్ రజాన్ పూజలో ఉంచి రూ. 3.25 లక్షలను నొక్కేశాడు.  ఇందులో రూ. 75 వేలను పూజ నిర్వహించిన సమీపంలో ఉన్న యంత్రం కింద దాచాడు. మిగిలిన రూ. 2.50 లక్షలను తన జేబులో పెట్టుకొన్నాడు. 

అయితే అతిథులతో మాట్లాడి పూజ వద్దకు వచ్చిన ప్రకాష్ చంద్ జైన్  గుర్తించాడు. వెంటనే ఇంటి సభ్యులను అప్రమత్తం చేశాడు. ఇంటిలో డబ్బుల కోసం వెతకడం ప్రారంభించారు. మరో వైపు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన రజాక్ కు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో Bathroom కు వెళ్లి రూ. 2.50 లక్షలను బాత్రూమ్ కమోడ్ లో వేసి ఫ్లష్ బటన్ నొక్కాడు. అయితే కొన్ని కరెన్సీ నోట్లు నీటిలో తేలియాడాయి.
తర్వాత ఏమీ తెలియనట్టుగా రజాక్ బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు.

ప్రకాష్‌చంద్ జైన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు  క్యాటరింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. షేక్ రజాక్ ఈ చోరీ చేసినట్టుగా గుర్తించారు. వెంటనే డబ్బుల కోసం పోలీసులు రజాక్ ను ప్రశ్నించారు. పూజ నిర్వహించిన గదికి సమీపంలోని ఓ యంత్రం కింద దాచిన రూ. 75 వేలను  పోలీసులకు చూపాడు. మిగిలిన రూ.. 2.50 లక్షల గురించి ప్రశ్నించారు. అయితే బాత్రూమ్ కమోడ్ లో వేసి ఫ్లష్ బటన్ నొక్కినట్టుగా నిందితుడు చెప్పాడు. బాత్రూమ్ లోని కమోడ్ ను తెరిచి చూస్తే నీటిలో నాలుగైదు Currency నోట్లు తేలియాడుతూ కన్పించాయి.  దీంతో పోలీసులు ప్లంబర్ ను పిలిపించి డబ్బుల కోసం  పైపు సహాయంతో వెదికారు. అయితే డబ్బులు మాత్రం దొరకలేదు. రజాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో హైద్రాబాద్ నగరంలో వాచ్‌మెన్లు, పనిమనుషులుగా పనిచేసిన కొందరు ఆ ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. గతంలో నేపాల్ కు చెందిన కొందరు పనిమనుషులు హైద్రాబాద్ లో ఇళ్లలో పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకొన్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios