కేవలం 15 నిమిషాల్లో రూ.కోటి దొంగతనం.. బంగారం దుకాణంలోకి ప్రవేశించి..!

షాపు ఓనర్‌కి ఆ ముగ్గురు వ్యక్తులని చూసి ఏదో అనుమానం కలిగింది. అయినా.. నవ్వుతూ.. "చెప్పండి సార్.. మీకేం కావాలి?" అని అడిగాడు. 
 

Rs.1.6 cr worth looted in bihar

కేవలం 15 నిమిషాల్లో ముగ్గురు వ్యక్తులు బంగారు దుకాణాన్ని లూటీ చేశారు. అది కూడా పట్టపగలే కావడం గమనార్హం. చాలా తెలివిగా జనాలు ఎక్కువగా ఉండే  ప్రాంతానికి వెళ్లి లూటీ చేశారు.  ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలోని వైశాలీ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వైశాలీ జిల్లాలోని బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక నగల దుకాణంలో ముగ్గురు వ్యక్తులు కస్టమర్లుగా ప్రవేశించారు. ముగ్గురు కూడా ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారు. అప్పటికే దుకాణంలో చాలా మంది కస్టమర్లు షాపింగ్ చేస్తున్నారు. షాపు ఓనర్‌కి ఆ ముగ్గురు వ్యక్తులని చూసి ఏదో అనుమానం కలిగింది. అయినా.. నవ్వుతూ.. "చెప్పండి సార్.. మీకేం కావాలి?" అని అడిగాడు. 

Also Read: నీటి సమస్య ఉందని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు తల్లిదండ్రులు..

అప్పుడు వారు కొన్ని నగలు చూపించమని అడిగారు. అలా కాసేపు వాళ్లు చాలా నగలు చూశారు. షాపు ఓనర్ ఒకసారి మీ ముఖం నుంచి మాస్క్ తీయండి? అని అడిగాడు. అప్పుడు వాళ్లు తమ దుస్తులలో దాచుకున్న మూడు గన్లు తీసి గాల్లో బుల్లెట్లు పేల్చారు. ఇది చూసి.. చుట్టు పక్కల ఉన్న జనం భయపడ్డారు. షాపు ఓనర్‌ని గన్‌పాయింట్‌పై పెట్టి నగలు, డబ్బు దోచుకొని వెళ్లిపోతూ.. మళ్లీ వచ్చి సీసీటీవి వీడియో ఎక్కడుందో అడిగి తెలుసుకొని, ఆ వీడియోని, దాని రికార్డర్‌ని నాశనం చేశారు.

ఆ తరువాత పోలీసులు వచ్చి విచారణ చేశారు. షాపు ఓనర్.. కథనం ప్రకారం ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి కస్టమర్లుగా వచ్చారు. గన్‌పాయింట్‌పై బెదిరించి షాపులోని నగలు, డబ్బు దోచుకొని ఒక బైక్‌పై పారిపోయారు. అంచానా ప్రకారం నగలు విలువ ఒక కోటి రూపాయలపైనే ఉంటుందని, డబ్బు రూ. 10 లక్షల వరకూ ఉంటుందని తెలిసింది. నగలలో బంగారం, వెండి, మరికొన్ని వజ్రాల నగలు ఉన్నాయని షాపు ఓనర్ తెలిపాడు.

పోలీసులకు సీసీటీవి వీడియో కూడా లభించకపోవడంతో.. ప్రస్తుతం వాళ్లు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios