Asianet News TeluguAsianet News Telugu

హేమంత్ హత్య: సుఫారీ గ్యాంగ్‌కి చెందిన నలుగురి అరెస్ట్

హేమంత్ ను హత్య కేసులో అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.హేమంత్ హత్య కేసులో సుఫారీ గ్యాంగ్ కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు.
 

Hyderabad police arrested another four for killing Hemanth lns
Author
Hyderabad, First Published Oct 5, 2020, 5:03 PM IST


హైదరాబాద్: హేమంత్ ను హత్య కేసులో అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.హేమంత్ హత్య కేసులో సుఫారీ గ్యాంగ్ కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.హేమంత్ ను హత్య చేయించేందుకు రూ. 30 లక్షలకు సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా ఆయన చెప్పారు.ఈ విషయమై ఇప్పటికే రూ. 10 లక్షలను చెల్లించారన్నారు.

also read:ప్రాణభయం ఉందని చెప్పలేదు: అవంతి, హేమంత్ కేసుపై సజ్జనార్

ఈ కేసులో ప్రధాన నిందితులు యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిల కస్టడీ పూర్తైందని ఆయన చెప్పారు. ఈ కేసులో మరో ఏడుగురి నిందితులను కస్టడీలోకి తీసుకొంటామని ఆయన చెప్పారు. నిందితుల్లో ఒకరికి కరోనా సోకిందన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి ఇన్స్ పెక్టర్ కు కూడ కరోనా సోకిందన్నారు.

హేమంత్ ను హత్య చేస్తే అవంతి తమ ఇంటికి వస్తోందని భావించారని డీసీపీ చెప్పారు. అయితే ఏం చేసినా కూడ తాను ఇంటికి రానని అవంతి తన కుటుంబసభ్యులకు తేల్చి చెప్పింది. ఈ కేసులో అవంతి తమకు 3 పేజీల లేఖను ఇచ్చిందని డీసీపీ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios