హైదరాబాద్: ప్రేమ వివాహం తర్వాత ప్రాణహాని ఉందని అవంతి, హేమంత్ కి తమకు చెప్పలేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

అవంతి, హేమంత్ ప్రేమ వివాహం తర్వాత  ప్రాణహని ఉందని చెప్పలేదన్నారు. ఈ కేసులో లక్ష్మీరెడ్డి, యుగంధర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకొంటామని ఆయన వివరించారు. ఈ కేసులో నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చిందని ఆయన తెలిపారు. 

also read:రక్షణ కల్పించాలని మాదాపూర్ డీసీపీని కోరిన అవంతి

గచ్చిభౌలిలో హేమంత్, అవంతి నివాసం ఉంటున్న విషయం కూడ తమకు తెలియదని ఆయన చెప్పారు. కనీసం ఇక్కడ ఉంటున్నట్టుగా తమకు సమాచారం తెలియదన్నారు. అవంతి కుటుంబసభ్యులు ఇక్కడికి వస్తున్నారని బెదిరిస్తున్నారని ఏనాడూ చెప్పలేదన్నారు. తమ దృష్టికి ఈ విషయాలను తీసుకొస్తే  రక్షణ చర్యలు తీసుకొనేవాళ్లమని సజ్జనార్ చెప్పారు.

హేమంత్ హత్య కుట్రలో ఎవరున్నా కూడ వదలబోమని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇప్పుడు రక్షణ కోరితే ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఆయన తెలిపారు.