హైదరాబాద్‌ని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు.
హైదరాబాద్: నగరంలోని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రైడ్ ఇండియాకు చెందిన కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేశారంటూ ఈ భవనాల కూల్చివేతకు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు భవనాల కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టడంతో భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ జరుగుతుంది.
ఇక, ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లో 44 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. అయితే ఈ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ నిర్మాణాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో.. అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు నాలుగు భవనాలను కూల్చివేస్తున్నారు. మిగిలిన వాటిని కూల్చివేస్తామని చెబుతున్నారు.
